Best Anti Aging Foods For Youthful Skin :సాధారణంగా వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ, ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి, ఇతర అనారోగ్యాల కారణంగా.. కొంతమందిలో చిన్న వయసులోనే ముఖంపై(Face)ముడతలు వచ్చి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఈ సమస్య నుంచి బయట పడడానికి.. ఏవేవో ఫేస్ ప్యాక్‌లు, ట్రీట్మెంట్‌లు ట్రై చేస్తూ డబ్బులు విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. అలాకాకుండా.. మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండా ఉంటారని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ, వృద్ధాప్యాన్ని దూరం చేసే ఆ ఆహారాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ద్రాక్ష :మీరు త్వరగా ముసలివారు కావొద్దంటే మీ డైలీ డైట్లో ద్రాక్ష పండ్లను చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, హెల్తీ ఫ్యాట్, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మ కణాలను నిత్యం ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయంటున్నారు. అంతేకాదు.. మెరుగైన రక్తప్రసరణకు తోడ్పడి చర్మానికి సాగే గుణాన్ని ఇస్తాయని చెబుతున్నారు.
దానిమ్మ : ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షిస్తాయి. అలాగే దీనిలో ఉండే విటమిన్ సి.. చర్మంలో కొత్త కణాల వృద్ధిని ప్రోత్సహిస్తుంది. ముఖంపై ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుందంటున్నారు నిపుణులు.
బ్లూబెర్రీ : ఈ పండ్లు వృద్ధాప్యాన్ని దూరం చేయడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, సి, ఈ విటమిన్లు ముఖ చర్మానికి మృదుత్వాన్ని అందిస్తాయి. కాలుష్యం, సూర్యరశ్మి నుంచి చర్మాన్ని సంరక్షించడమే కాకుండా.. హైపర్ పిగ్మెంటేషన్ సమస్యను దరిచేరనివ్వకుండా కాపాడతాయి. అలాగే.. ఈ పండ్లలో సమృద్ధిగా ఉండే సాల్సిలిక్ యాసిడ్ చర్మంలోని మృతకణాలను బయటకు పంపుతుంది. వీటిలోని సి విటమిన్, యాంతోసయానిన్ బాడీలో కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడి చర్మానికి సాగే గుణాన్ని అందిస్తాయంటున్నారు నిపుణులు.
ఈ 3 పనులు చేస్తున్నారా? - అయితే మీరు త్వరగా ముసలివారు అయిపోతారట!