Benefits Of Poppy Seeds In Telugu :ఇండియన్ కిచెన్లో మసాలా దినుసులకు ప్రాధాన్యం ఎక్కువ. ఇవి వంటలకు రుచిని అందించడమే కాకుండా మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. సంప్రదాయ ఔషధాలుగా ఉపయోగించే మసాలా దినుసుల్లో గసగసాలు మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి. రోజూవారీ ఆహారంలో గసగసాలను చేర్చుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. కణాల వాపు తగ్గడానికి, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ పనితీరు మెరుగవడానికి గసగసాలు చక్కగా పనిచేస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచివేనా? వీటివల్ల కలిగే మరిన్న ప్రయోజనాలేంటి వివరంగా తెలుసుకుందాం.
గసగసాలు మంచివేనా?
గసగసాల వినియోగం విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదట. ఇవి కచ్చితంగా ఆరోగ్యానికి మేలు చేసేవేనని చెబుతున్నారు నిపుణులు. ఇందులో కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. గసగసాల్లోని లిగ్నాన్స్ క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణితుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
1. గుండె ఆరోగ్యం
గసగసాలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే అసంతృప్త కొవ్వులు కలిగి ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అదనంగా గసగసాల్లో అధిక పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి, ధమనుల గోడలను బలోపేతం చేసి గుండె పనితీరును ప్రోత్సహించడానికి సహాయపడతాయి.