తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 8:38 AM IST

ETV Bharat / health

ధనియాలతో ఈజీగా వెయిట్​ లాస్​! ఇలా తీసుకున్నారంటే ఊహించని ఫలితాలు ఖాయం!! - Benefits Of Soaked Coriander Water

Soaked Coriander Water Benefits : ధనియాలు కేవలం వంటల్లోకి మసాలాలుగా మాత్రమే వాడుతున్నారా? వీటిని వంటల్లో కాకుండా నేరుగా నీటిలో నానబెట్టుకుని తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

health Benefits Of Soaked Coriander Water
Coriander Water health benefits (Getty Images)

Soaked Coriander Water Benefits :ఇండియన్ కిచెన్లో రోజూ వాడే ఆహార పదార్థం కొత్తిమీర. ఇది వంటలకు మంచి అలంకరణతో పాటు రుచి, సువాసనను కూడా అందిస్తుంది. కొత్తిమీర తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలకు కూడా కొదవేం ఉండదు. ఇవన్నీ కొత్తిమీర సంగతులు. మరి దాని పుట్టకకు కారణమైన ధనియాల సంగతేంటి. ఇవి చాలా ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయంటే నమ్ముతారా? అవును మార్కెట్లో చాలా సులువుగా, తక్కువ ధరకే దొరికే ధనియాలను, నీటిలో నానబెట్టుకుని తీసుకోవడం వల్ల ఊహించని ఫలితాలు చూడచ్చు. వీటిని నేరుగా కాకుండా నానబెట్టుకుని ఈ నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందట. ధనియా వాటర్​తో కలిగే లాభాలను గురించి ప్రముఖ డైటీషియన్ శ్రీమతి అనుమప గిరోత్రా ఏం చెబుతున్నాంటే?

ఇమ్యూనిటీ బూస్టర్
రోగనిరోధక వ్యవస్థ అనేది శరీరంలోని ప్రధాన రక్షణ యంత్రాంగం. ఏ వ్యాధితో పోరాడాలన్నా ఇది సహాయపడుతుంది. అలాంటి రోగనిరోధక శక్తిని సహజంగా పెంచే ఆహార పదార్థాల్లో ధనియాలు గొప్పవి. కిచెన్​లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ధనియాలు శరీరంలోని రాడికల్ ఎలిమెంట్లకు వ్యతిరేకండా పోరాడటానికి సహాయపడతాయి. కొవిడ్ వంటి ప్రమాదకరమైన వైరస్​లు, ఫ్లూతో పోరాడే శక్తి ధనియా వాటర్​కు ఉంది.

వెంట్రుకలకు బలం :
ధనియాలలో విటమిన్-కె, విటమిన్-సి, విటమిన్-ఏలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేసేందుకు ఎంతో సహాయపడతాయి. గ్లాసు నీటిలో ధనియాలను నానబెట్టుకుని తాగడం వల్ల వెంట్రుకలు కుదుళ్ల నుంచి మెరుగయి, జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. ధనియాలు హెయిర్ మాస్క్ లాగా కూడా చక్కగా ఉపయోగపడతాయి.

బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది :
నానబెట్టిన ధనియా వాటర్​ను తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. వైద్యశాస్త్రంలో ధనియాలను మంచి ప్రాధాన్యం ఉంది. ఉదయాన్నే ధనియా వాటర్ తాగడం వల్ల అరుగుదల బాగుంటుంది. జీర్షక్రియ మెరుగ్గా పనిచేయడం వల్ల శరీర బరువు కూడా త్వరగా తగ్గుతుంది.

బ్లడ్ షుగర్ లెవెల్స్
ముందుగా నానబెట్టిన ధనియా వాటర్​ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లు తమ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకునేందుకు ధనియా వాటర్ చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.

కిడ్నీలకు సహాయం :
ధనియా వాటర్ కిడ్నీలను బలపరుస్తుంది. కిడ్నీల సామర్థ్యాన్ని పెంచి మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తినిస్తుంది. శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్​గా ఉండేందుకు, టాక్సిన్లను బయటకు పంపేందుకు, గ్యాస్ట్రిక్ సమస్యలను నయం చేసేందుకు కూడా ధనియా వాటర్ బాగా సహాయపడుతుంది.

పింపుల్స్ అండ్ పిగ్మెంటేషన్
ధనియాలలో ఉండే ఐరన్ ఫంగస్​తో పోరాడటానికి సహాయపడుతుంది. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మృదువైన చర్మం కావాలంటే క్రమం తప్పకుండా ధనియా వాటర్ తాగాల్సిందే.

ఇంతకీ ధనియా వాటర్ తయారుచేయడం ఎలా?

కావాల్సినవి:

  • ఒక టేబుల్ స్పూన్ ధనియాలు
  • ఒక గ్లాసు నీరు

తయారీ విధానం:

  • రాత్రి పడుకునే ముందు గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసి రాత్రంతా నాననివ్వాలి.
  • మరుసటి రోజు ఉదయం ధనియా గింజలను తీసేసి నీటిని వడకట్టుకుని తాగాలి.

అలర్ట్ : హీరోయిన్​కు రొమ్ము క్యాన్సర్! - ఈ క్యాన్సర్ గడ్డను ఎలా గుర్తించాలో మీకు తెలుసా? - Breast Cancer Symptoms

అలర్ట్ : పిజ్జా, చిప్స్ తింటే చిన్నవయసులోనే "పెద్ద మనిషి" అయిపోతారు! - షాకింగ్ రీసెర్చ్! - Early Age Menstruation Reasons

ABOUT THE AUTHOR

...view details