Benefits Of Desi Ghee For Skin : చర్మ సంరక్షణ, సౌందర్యం కోసం ఎన్నో ఉత్పత్తుల్ని వినియోగిస్తాం. అందులో లోషన్స్, క్రీమ్స్, లాంటివి అనేకముంటాయి. వీటితో పాటు కొందరు సొంతంగా ఇంటింటి చిట్కాలు వాడుతుంటారు. అలా మనింట్లోనే ఉండే ఓ పదార్థం కూడా చర్మ సౌందర్యం మెరుగుపర్చడంలో ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు. ఆ పదార్థమే నెయ్యి.
దేశీ నెయ్యి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని మన దేశంలో పురాతన కాలం నుంచి ఆయుర్వేద చికిత్సలో వాడుతున్నారు. ముఖ్యంగా చర్మ సమస్యల నివారణకు ఈ నెయ్యిని ఉపయోగిస్తారు. దాన్ని నేరుగా మీ ముఖానికి అప్లై చేయడం వల్ల మీ చర్మానికి సహజమైన మెరుపు లభిస్తుంది. దేశీ నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, బ్యూట్రిక్ యాసిడ్, విటమిన్-ఎ, విటమిన్-బి12, విటమిన్-డి, విటమిన్-ఇ, విటమిన్-కె పుష్కలంగా లభిస్తాయి. ఇంకా దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. మృదువైన చర్మం కోసం
ఆరోగ్య సమాచారాన్ని అందించే అమెరికాకు చెందిన హెల్త్‌లైన్ ప్రకారం, నెయ్యిలో ఉండే విటమిన్-ఎ, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సహజంగా చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. అందువల్ల శరీరానికి నెయ్యిని అప్లై చేయడం వల్ల పొడిబారిన చర్మం కూడా మృదువుగా మారుతుంది.
2. పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది
నెయ్యి మన చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. కొల్లాజెన్ వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. దీన్ని రాసుకుంటే పిగ్మెంటేషన్ సమస్య తగ్గుతుంది. నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌తో పాటు పిగ్మెంటేషన్ వల్ల ఏర్పడిన మచ్చలను కూడా తొలగిస్తాయి.
3. ముడతలను నివారిస్తుంది
దేశీ నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మంపై ఏర్పడిన ముడతలను, ఫైన్ లైన్లను తగ్గిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం వల్ల గ్లోనెస్ పెరిగి ముడతలు కనిపించకుండా ఉంటాయి.