Benefits Of Coconut Water For Hair In Telugu : వేసవికాలం వచ్చిందంటే చాలు చాలా మంది కొబ్బరినీళ్లను తాగుతుంటారు. అనారోగ్యం బారినపడినప్పుడు సీజన్ ఏదైనా సరే కొబ్బరినీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. కొబ్బరినీళ్లు రుచికరమైన, పోషకాలు సమృద్ధిగా ఉండే పానీయం. ఈ నీటిలో ఎన్నో పోషకాలు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, సహజ చక్కెరలు, విటమిన్లు ఉంటాయి. అంతేకాదు కొబ్బరి నీళ్లకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఇవి జుట్టుకు కూడా మంచి పోషకాలు అందించి, మాయిశ్చరైజింగ్ ఏజెంట్లా పనిచేస్తాయి. జుట్టుకు కొబ్బరి నీళ్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం.
జుట్టుకు కొబ్బరి నీళ్ల వల్ల కలిగే 7 ప్రయోజనాలు :
1. మీ జుట్టును హైడ్రేట్ చేస్తుంది
కొబ్బరినీళ్లు శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి. ఇందులో హైడ్రేట్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీరు దాహాన్ని తీర్చుతుంది. అయితే కొన్నిసార్లు జుట్టు నిర్జీవంగా మారుతుంది. కొబ్బరి నీళ్లలో ఉండే లారిక్ యాసిడ్, యాంటీ మైక్రోబయల్ ఫ్యాటీ యాసిడ్లు పొడిబారిన మీ జుట్టుకు తేమను అందించడంలో సహాయపడుతాయి. ఈ సహజ రిఫ్రెష్‌మెంట్ ఎలక్ట్రోలైట్‌లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం లాంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవి మీ జుట్టును, స్కాల్ప్‌ను హైడ్రేట్ చేస్తాయి.
2. దెబ్బ తిన్న జుట్టుకు కొబ్బరి నీరు :
కొబ్బరి నీళ్లు తలపై వేసే దురదను వదిలించుకునేందుకు సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లు తలకు పట్టించడం వల్ల చుండ్రు నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దెబ్బతిన్న జుట్టును పునరుద్ధరించుకోవడానికి సహాయపడతాయి.
3. మీ జుట్టును బలంగా ఉంచుతాయి :
కొబ్బరి నీళ్లకు జుట్టును బలంగా ఉంచుతాయి. తలమీద చర్మాన్ని ఉత్తేజపరిచే కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు మెరుగైన రక్త ప్రసరణతో పాటు, జుట్టు తంతువులను మరింత దట్టంగా ఉండేలా చేస్తాయి.