Benefits Of Boiled Groundnut :సీజన్ వచ్చిందంటే చాలు ఎంతో మంది పచ్చి పళ్లీలను కొనుక్కుని వేయించుని, ఉడకబెట్టుకుని తింటుంటారు. ఇవి కేవలం టేస్టీ స్నాక్ మాత్రమే కాదట. ఎంతో హెల్దీ ఫుడ్ అని చెబుతున్నారు ఆహార నిపుణులు. వేరుశనగలను ఉడకించుకుని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట. ఉడకబెట్టిన పళ్లీలను మీ రోజూ వారీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
పోషకాలు
ఉడికించిన వేరుశనగల్లో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్తోపాటువివిధ విటమిన్లు, ఖనిజాలతో సహా శరీరానికి అవసరమైన పోషకాలెన్నో ఉంటాయి. ఇవి మీ మొత్తం ఆరోగ్యం బాగుండేందుకు సహకరిస్తాయి.
ఆరోగ్యకరమైన కొవ్వులు
వేరుశనగల్లో మోనోసాచురేటెడ్, పాలీఅన్ సాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొవ్వులుగా వైద్యులు చెబుతుంటారు. వీటిని మితంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు
ఉడికించిన పళ్లీల్లో రెస్వెరాట్రాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను నియంత్రణలో ఉంచేందుకు ఉపయోగపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపు వంటి సమస్యలకు తగ్గించడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సహాయపడతాయి.