తెలంగాణ

telangana

ETV Bharat / health

విపరీతమైన నడుము నొప్పితో బాధపడుతున్నారా ? - ఈ డ్రింక్​ తాగితే మీ పెయిన్​ తగ్గుతుందట!

-పెయిన్​ తగ్గేందుకు బామ్స్​​, స్ప్రేలు అవసరం లేదు -ఈ పద్ధతిలో తాగితే బెస్ట్​ రిజల్ట్​

By ETV Bharat Health Team

Published : 5 hours ago

Lower Back Pain
Ayurvedic Medicine for Lower Back Pain (ETV Bharat)

Ayurvedic Medicine for Lower Back Pain :ప్రస్తుత కాలంలో చాలా మంది నడుము నొప్పితో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే బ్యాక్​ పెయిన్​ రావడానికి చాలా కారణాలుంటాయి. ముఖ్యంగా ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోవడం, అధిక సమయం డ్రైవింగ్​ చేయడం, పోషకాహార లోపం వంటివి ప్రధానమైనవి. అయితే, నడుము నొప్పి తగ్గడానికి ఎక్కువ మంది పెయిన్ బామ్స్​, పెయిన్​ కిల్లర్స్​ ఉపయోగిస్తుంటారు. వీటివల్ల తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం లభిస్తుంది. అయితే, నడుము నొప్పి తగ్గడానికి ఒక ఔషధం బాగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు డాక్టర్​ గాయత్రీ దేవీ చెబుతున్నారు. మరి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఔషధం తయారీకి కావాల్సిన పదార్థాలు..

  • శుద్ద గుగ్గులు
  • వావిల ఆకులు
  • అశ్వగంధ
  • దుంపరాష్ట్రం

ప్రయోజనాలు:

శుద్ద గుగ్గులు:బ్యాక్​ పెయిన్ తగ్గడానికి శుద్ధ గుగ్గులు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇవి జాయింట్​ పెయిన్స్​ తగ్గించేలా చేస్తాయి. బయట మార్కెట్లో మనకు శుద్ధ గుగ్గులు దొరుకుతాయి. వీటిని శుద్ధి చేసిన తర్వాత చూర్ణం​ చేసుకోవాలి.

వావిల ఆకులు: వాత దోషాన్ని తగ్గించడానికి వావిల ఆకుల మూలికలు చక్కగా పని చేస్తాయి. వావిల ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి.

అశ్వగంధ చూర్ణం :అశ్వగంధ కూడా వాత దోషాన్ని తగ్గిస్తుంది. దీనిద్వారా నొప్పులన్నీ తగ్గిపోతాయని అంటున్నారు.

దుంపరాష్ట్రం :కీళ్ల నొప్పులు తగ్గడానికి దుంపరాష్ట్రం బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే వెన్ను పూసల మధ్యలో నొప్పి ఉన్నాకూడా తగ్గుతుందని అంటున్నారు. దుంపరాష్ట్రం కూడా చూర్ణం సిద్ధం చేసుకోవాలి.

తయారీ విధానం:ఇప్పుడు ఒక బౌల్లోకి శుద్ద గుగ్గుల చూర్ణం, వావిల ఆకుల, అశ్వగంధ చూర్ణం, దుంపరాష్ట్రం చూర్ణం అన్నింటినీ ఒక్కోటి 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఈ పొడిని మనం గాజు సీసాలో స్టోర్​ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఔషధం తయారీ విధానం చూద్దాం..

  • ముందుగా స్టౌపై గిన్నె పెట్టి గ్లాసు నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలి.
  • నీరు మరుగుతున్న సమయంలో ముందుగా కలుపుకున్న చూర్ణాల మిశ్రమాన్ని ఒక చెంచా వేసి కలుపుకోవాలి.
  • స్టౌ మీడియం​ ఫ్లేమ్​లో పెట్టి కషాయం.. సగం నీరు ఇగిరేంత వరకు కాచుకోవాలి..
  • కషాయం సగం ఇంకితే ఔషధం తయారైపోయినట్లే..
  • ఇప్పుడు ఈ కషాయాన్ని వడబోసి.. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.

ఈ కాషాయం ఎప్పుడు ? ఎంత పరిమాణంలో తాగాలి ?:నడుము నొప్పితో బాధపడేవారు ఉదయం, సాయంత్రం ఒకసారి ఈ కషాయం తాగాలి. 30-40 మిల్లీలీటర్ల కషాయం తీసుకోవాలని డాక్టర్​ గాయత్రీ దేవీ సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

కఫం పేరుకుపోయి ఇబ్బందిపడుతున్నారా? - ఈ​ ఫుడ్​ తింటే మంచిదట!

సన్నగా ఉన్నామని ఫీలైపోతున్నారా? - ఆయుర్వేద నిపుణులు ఈ పథ్యాహారం సూచిస్తున్నారు!

ABOUT THE AUTHOR

...view details