తెలంగాణ

telangana

ETV Bharat / health

అనంత్‌ అంబానీ వెయిట్ లాస్ - ఇలా చేసి 108 కేజీలు తగ్గారు! - మీరూ ట్రై చేస్తారా? - How Anant Ambani Weight Loss telugu

How Anant Ambani Weight Loss : ఇటీవలే అత్యంత వైభవంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ- వెడ్డింగ్‌ వేడుకలు జరిగాయి. అయితే, అనంత్‌ అంబానీ ఒకానొక సమయంలో కఠినమైన డైటింగ్‌, వ్యాయామాలు చేసి 108 కేజీల బరువు తగ్గారు. మరి అనంత్‌ అంబానీకి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పని చేసిన వారు ఎవరు ? అనంత్‌ అంబానీ రోజుకు ఎన్ని గంటలు ఎక్సర్‌సైజ్‌లు చేశారు ? అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

How Anant Ambani Weight Loss
How Anant Ambani Weight Loss

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 10:03 AM IST

How Anant Ambani Weight Loss :భారతదేశ సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమం ఇటీవల అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌ వేదికగా మార్చి 1 నుంచి 3 వరకు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

అయితే.. ఈ సందర్భంలో అనంత్ అంబానీ బరువు కూడా ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. ఎందుకంటే.. గతంలో పక్కా డైట్ పాటించి తన ఊబకాయాన్ని కంప్లీట్ గా తగ్గించుకున్నారు అనంత్. అతని వెయిట్ లాస్ చూసి అందరూ ఆశ్ఛర్యపోయారు. అలాంటిది.. మళ్లీ బరువు పెరిగిపోవడంతో ఇప్పుడు కూడా జనం ఆశ్చర్యపోయారు. దీనికి గల కారణమేంటో అనంత్ అంబానీ చెప్పారు. ఆస్తమా మందుల వల్లనే బరువు పెరిగినట్టు వివరించారు.

అయితే.. అనంత్‌ అంబానీ బరువు తగ్గడానికి ఎంచుకున్న మార్గమేంటి అన్న ప్రశ్న చాలా మంది మనసులో అలాగే నిలిచిపోయింది. అవును మరి.. ఒకటీ రెండు కేజీలు కాదు.. ఏకంగా 108 కేజీల బరువు తగ్గారు! ఇది సాధారణ విషయం కానే కాదు. మరి.. ఇంత బరువు ఎలా తగ్గారు? ఇందుకోసం ఆయన పాటించిన డైట్ ఏంటి? చేసిన వర్కవుట్స్ ఏంటి? అసలు.. ఆనంత్ బరువు తగ్గడం వెనకున్నది ఎవరు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అనంత్ అంబానీ బరువు తగ్గడం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు?
అనంత్ అంబానీ 108 కిలోల బరువు తగ్గడం వెనుక ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ "వినోద్ చన్నా" ఉన్నారు. బాలీవుడ్ స్టార్లు జాన్ అబ్రహం, అర్జున్ రాంపాల్, వివేక్ ఒబెరాయ్, శిల్పా శెట్టి కుంద్రా, హర్షవర్ధన్ రాణే వంటి వారికి కూడా వినోద్‌ చన్నా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పని చేశారు. చన్నా డైట్‌ ప్లానింగ్‌, వ్యాయామాల వల్ల అనంత్‌ అంబానీ కేవలం 18 నెలల్లోనే 108 కేజీల బరువు తగ్గారు.

డైట్ ఇదీ.. వర్కవుట్స్ అవీ..

అనంత్‌ అంబానీ డైట్‌లో ఫైబర్‌ అధికంగా ఉండేలా చూశారట వినోద్ చన్నా. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు తక్కువగా ఉండేలా ప్లాన్ చేశారట. అలాగే.. బరువు తగ్గడానికి వ్యాయామాలు చేస్తున్న సమయంలో జీరో-షుగర్ డైట్‌ విధానాన్ని పాటించారు. ఇంకా.. రోజూ పండ్లు, కూరగాయలను కూడా అనంత్ అంబానీ డైట్‌లో యాడ్‌ చేసుకున్నారు. అలాగే బాడీని ఫిట్‌నెస్‌గా ఉంచడానికి రోజూ కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ వంటి వ్యాయామాలను 5 నుంచి 6 గంటలు చేసేవారట. ఇందులో భాగంగానే ప్రతి రోజూ 21 కిలోమీటర్లు నడిచారు. యోగా కూడా చేసేవారట. ఇలా కఠినమైన డైట్‌ తీసుకుంటూ.. వ్యాయామాలు చేయడం వల్లనే అనంత్‌ అంబానీ బరువు తగ్గారు.

అసాధ్యం కాదు..

బరువు పెరిగిన వారు దాన్ని తగ్గించుకోవడం అసాధ్యం కాదని.. అనంత్ అంబానీ ఎపిసోడ్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. దానికి కావాల్సిందల్లా అంకిత భావం ఒక్కటే. కచ్చితంగా బరువు తగ్గాలని నిర్ణయించుకొని.. కఠిన నియమాలను అనుసరిస్తే తప్పకుండా బరువు తగ్గొచ్చని అనంత్ నిరూపించారు. చక్కటి డైట్ ఫాలో అవుతూ.. సరైన వర్కవుట్స్ చేస్తే కొండలాంటి మీ పొట్ట కూడా.. మంచు ముద్దలా కరిగిపోవడం గ్యారెంటీ. మరి.. మీరూ ట్రై చేస్తారా?

ప్రీ వెడ్డింగ్​లో మెరిసిన నీతా అంబానీ- రూ.500 కోట్ల డైమండ్ నెక్లెస్​తో స్పెషల్ అట్రాక్షన్!

అంబానీ ప్రీ వెడ్డింగ్​లో 'నాటు నాటు' ఫీవర్​ - చెర్రీతో స్టెప్పులేసిన బాలీవుడ్ తారలు

అంబానీల ప్రీవెడ్డింగ్​లో రామ్​చరణ్ స్టెప్పులు- జంగిల్ సఫారీ డ్రెస్సుల్లో ఫోజులిచ్చిన సెలెబ్రిటీస్

ABOUT THE AUTHOR

...view details