Saffron Health Benefits : ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమ పువ్వు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇరిడాసే కుటుంబానికి చెందిన దీనిని ప్రధానంగా శీతల ప్రదేశాల్లో పండిస్తారు. కేసరాలు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటాయి. అయితే కుంకుమ పువ్వను కేవలం ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్లే తినాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది నిజం కాదంటున్నారు నిపుణులు. దీనిని ఎవరైనా ఆహారంలో భాగం చేసుకోవచ్చని.. వీటిని తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
మానసిక స్థితి మెరుగుపడుతుంది:కుంకుమపువ్వు మానసిక స్థితిని మెరుగుపరచడంలో, డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కుంకుమపువ్వు యాంటీ డిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. కుంకుమపువ్వు డిప్రెసివ్ మూడ్ను తగ్గిస్తుందని Frontiers Nutritionలో ప్రచురితమైంది.
PMS లక్షణాలను తగ్గించడం: ప్రీమెన్స్ట్రువల్ లక్షణాల తీవ్రతను తగ్గించడంలో కుంకుమ పువ్వు సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అంటే పీరియడ్స్ వచ్చే ముందు చాలా మంది మానసికంగా, శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యలను తగ్గించడంలో కుంకుమపువ్వు ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే విషయం యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్లో ప్రచురితమయ్యింది.
బరువు తగ్గడానికి:బరువు తగ్గాలని భావించేవారికి కుంకుమపువ్వు బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. కుంకుమపువ్వులోని పోషకాలు ఆకలిని నియంత్రించడానికి ఉపయోగపడతాయని తద్వారా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. ఇదే విషయాన్ని న్యూట్రిషన్ రీసెర్చ్ జర్నల్లోని ఓ అధ్యయనంలో ప్రచురితం చేశారు.
సమ్మర్లో డైలీ మజ్జిగ తాగుతున్నారా? - ఈ ఆరోగ్య సమస్యలన్నీ దూరం అయినట్లే!
గుండె ఆరోగ్యానికి:కుంకుమపువ్వు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సాయపడతాయి. ఇవి రెండు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో కుంకుమపువ్వులోని యాంటీఆక్సిడెంట్ గుణాలు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని కనుగొన్నారు.