Food Poisoning Preventing Tips :వర్షాకాలంలో మనల్ని తరచూ పట్టి పీడించే సమస్య ఫుడ్ పాయిజనింగ్. తేమతో కూడిన వాతావరణం ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా పెరిగేందుకు చక్కగా అనుకూలిస్తుంది. అలాగే మనం తీసుకునే ఆహారం శుభ్రంగా లేకపోయినా, అపరిశుభ్రవాతావరణంలో తయారు చేసిందైనా లేక ఎక్కువ కాలం పాటు నిల్వ చేసింది అయినా అది మన ఆరోగ్యానికి హాని తలబెడుతుంది. పొరపాటుగా వీటిని మనం తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యే ప్రమాదముంటుంది. ఈజీగా తీసుకుంటాం కానీ నిజానికి ఇది పెద్ద సమస్యే.
ఫుడ్ పాయింజనింగ్ అయితే సిస్టమ్ అంతా దెబ్బతిన్నట్లే. దీని ప్రభావం జీర్ణవ్యవస్థపై కొద్ది రోజుల పాటు ఉంటుంది. కాబట్టి బడా సెలబ్రిటీలు సైతం ఈ సమస్య వచ్చిందంటే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిందే. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే ఫుడ్ పాయిజనింగ్ అయినప్పు భయపడకుండా తినగలిగే ఆహరాలు, అస్సలు తినకూడని కొన్ని ఆహారాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని గుర్తించడమెలా
సాధారణంగా మన తిన్న ఆహారం ఆరోగ్యకరమైనది కానప్పుడు కడుపులో నొప్పి, వికారం, పుల్లటి తేనుపులు, జ్వరం, వాంతులు వంటి సమస్యలు వస్తుంటాయి. నీరసంగా ఉండటంతో పాటు డీహైడ్రేట్‌గా అనిపిస్తుంటుంది. ఇలా జరిగినప్పుడు కొన్ని ఆహరాలను తీసుకోవడం వల్ల త్వరగా రికవరీ అవచ్చట. అవేంటంటే..
ఇంట్లో వండిన ఆహారాలు
ఫుడ్ పాయిజనింగ్ అయినప్పడు తీసుకునే ఆహారంలో విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో చేసుకున్నదే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఖిచ్డీ లాంటి లైట్ ఫుడ్, చికెన్ సూప్, నట్స్, విత్తనాలు వంటి ప్రొటీన్లు కలిగిని ఆహారాలను తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ సమస్య నుంచి త్వరగా కోలుకోవచ్చ.
హర్బల్ టీలు
కడుపు బాగాలేనప్పుడు మొదటగా చేయాల్సిన పనేంటంటే.. ఏదైనా హెర్బల్ టీ తాగడం. ఇవి ఫుడ్ పాయిజనింగ్ నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి. ముఖ్యంగా ఒరెగానో, తులసి వంటి ఆకులతో తయారు చేసిన టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.