తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పాప కావాలా? బాబు కావాలా? - రణ్​వీర్ సమాధానమిదే - Deepika Padukone Baby - DEEPIKA PADUKONE BABY

Ranveer Singh Deepika Padukone Baby : బాలీవుడ్ భామ దీపికకు పుట్టబోయేది అబ్బాయా?అమ్మాయా? అనే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రణ్​వీర్ తనకు పాప కావాలా? బాబు కావాలా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే?

Source ANI
Ranveer Singh Deepika Padukone Baby (Source ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 3:10 PM IST

Ranveer Singh Deepika Padukone Baby :బాలీవుడ్ క్యూట్ కపుల్ దీపికా పదుకొణె, రణ్​వీర్ సింగ్​ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 29న దీపిక తన ప్రెగ్నెన్సీ వార్తను తెలిపి అభిమానులను ఆశ్చర్యపరిచారు. దీంతో అప్పటి నుంచి దీపికకు పుట్టబోయేది ఆడబిడ్డ? మగబిడ్డా? అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతూనే ఉంది. ఇదే విషయంపై గతంలో రణ్​వీర్ కూడా స్పందించారు. ఇప్పుడు మరోసారి ఆ కామెంట్స్​ తెరపైకి వచ్చాయి.

అబ్బాయి కావాలా లేక అమ్మాయా?

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో రణ్‌వీర్ సింగ్ జయేష్‌భాయ్ జోర్దార్ ప్రమోషన్ సమయంలోనిది. ఆ సమయంలో బాబు కావాలా, పాప కావాలా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పారు రణ్​వీర్. అది తన చేతుల్లో లేదని అన్నారు. అలానే ఓ సినిమా డైలాగ్​ను కూడా చెప్పాడు. మనం గుడికి వెళితే ఇచ్చిన ప్రసాదం తీసుకుంటాం గానీ లడ్డూ కావాలి, షీరా కావాలి అని అడగం, అలాగే భగవంతుడు ఏది ఇస్తే అది స్వీకరిస్తానన్నారు.

దీపిక చిన్నప్పటి ఫోటోలు ఓ సారి చూశానని, అందులో దీపిక చాలా ఉందని చెప్పిన రణ్​వీర్​ అప్పుడే తనకు అలాంటి అందమైన పాప కావాలని కోరుకున్నట్లు చెప్పారు. దీపికా, తాను పిల్లల కోసం కొన్ని పేర్లు సిద్ధం చేసుకున్నామని కానీ వాటిని ఇప్పుడే బయట పెట్టనని వెల్లడించారు. ప్రస్తుతం రణ్​వీర్ చేసిన ఈ ఓల్డ్​ కామెంట్స్​ మరోసారి నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ కామెంట్స్​ విన్న అభిమానులు దీపికపై రణ్​వీర్​కు ఉన్న ప్రేమకు నిదర్శనమని అంటున్నారు.

దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ ఒకరినొకరు ప్రేమించి నవంబర్ 2018లో ఇటలీ వేదికగా వివాహం చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే దీపిక నటించిన ‘కల్కి 2898 AD’ సినిమా భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ఇంకా రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న సింగం ఎగైన్‌లో రణ్‌వీర్​తో కలిసి దీపిక నటిస్తోంది. అలానే రణవీర్ సింగ్ చేతిలో డాన్ త్రీ, శక్తిమాన్ సినిమాలున్నాయి.

ఆ రికార్డుకు అడుగు దూరంలో 'కల్కి' - 11 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

కమల్​ హాసన్ - ఆ హాలీవుడ్ స్టార్​ హీరో కోసం మేకప్ ఆర్టిస్ట్‌గా! - Kalki 2898 AD Kamal Haasan

ABOUT THE AUTHOR

...view details