Amala About Nagarjuna Angry :కింగ్ నాగార్జున ఒకానొక సందర్భంలో తన వైఫ్ అమలతో మాట్లాడటమే మానేశారట. ఈ సంగతి గురించి అమలనే స్వయంగా చెప్పారంటూ ఓ ఇంగ్లీష్ మీడియా రాసుకొచ్చింది. ఇంతకీ ఆయన ఎందుకలా చేశారంటే?
నాగ్ ప్రేమగా పెంచుకునే ఓ లాబ్రాడర్ డాగ్‌ను ట్రైనింగ్ కోసం ఒక నెల పాటు బయటకు పంపడం వల్ల ఇదంతా జరిగిందని అంటున్నారు. తన షూటింగ్ పని వల్ల బయటకు వెళ్లిన నాగార్జున ఇంటికి తిరిగి వచ్చేసరికి తన పెంపుడు కుక్క కనిపించకపోవడంతో షాక్ అయ్యారట. ట్రైనింగ్ కోసం ఒక నెల రోజులు బయటకు పంపించానని చెప్పినప్పటికీ కోపం తగ్గలేదట. అంతేకాకుండా నీతో నేను మాట్లాడను అని అమల మీద కోపగించుకున్నారట కూడా.
"ఆ లాబ్రాడర్‌ను కేవలం ఒక నెల మాత్రమే ట్రైనింగ్ కోసం పంపించాను. ఎందుకంటే అది బాగా ట్రైన్ అవ్వాలనేది నా ఉద్దేశ్యం. తన షూటింగ్ పూర్తి చేసుకుని నాగ్ ఇంటికి వచ్చేసరికి ఆ కుక్క ఆయనకు కనిపించలేదు. ప్రతిసారీ ఆయన వచ్చీరాగానే అదే ముందు వెళ్లి వెల్కమ్ చెబుతుంది. అలా జరగకపోవడంతో షాక్ అయి అఖిల్‌ని, నన్ను దాని గురించి అడిగారు. ఆయనకు పూర్తిగా వివరించి చెప్పాను. అంతే నేనిక నీతో మాట్లాడను అనేశారు" అని తెలిపారు అమల.