Actor Who Worked For Rs.500 Remuneration : సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలని ఉందని ఎవరైనా చెబితే, వెంటనే తెలిసిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? అనే ప్రశ్న ఎదురవుతుంది. నాటి నుంచి నేటి వరకు ఇందులో ఏమార్పు రాలేదు. ఎందుకంటే సినిమా పరిశ్రమలో తెలిసిన వాళ్లుంటే అవకాశాలు సులువుగా దొరుకుతాయని కొందరి నమ్మకం. మరి సినిమాల్లో బాగా స్థిరపడిన కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే? ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
ఈ అవకాశం ఉండి కూడా ఓ వ్యక్తి స్వయం కృషినే నమ్ముకున్నారు. కెరీర్ ప్రారంభంలో రూ.500కి పని చేశారు. బట్టల దుకాణంలో పని చేశారు. అవసరాలు తీర్చుకోవడానికి అండర్-17, అండర్-19 జట్టులకు ప్రాతినిధ్యం వహించారు. కట్ చేస్తే కన్నడ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా రాణిస్తున్న టాప్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా ఉన్నారు. లెక్కలేనన్ని అవార్డులు, ప్రశంసలు. కానీ ఇవన్నీ అంత సులువుగా దక్కలేదు. ఇంతకీ మనం మాట్లాడుకుంటోంది ఎవరి గురించో తెలుసా? కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్. జనసత్తా నివేదికలో పేర్కొన్న సుదీప్ జీవిత, సినీ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నటనలో శిక్షణ, ఆరంభ కాలంలో కష్టాలు
కిచ్చా సుదీప్ తండ్రి ఒక గౌరవప్రదమైన హోటల్ వ్యాపారి. ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారారు. కానీ సుదీప్ ఎల్లప్పుడూ స్వయం కృషినే నమ్ముకున్నారు. తన తండ్రి నుంచి ఎప్పుడూ ఆర్థిక సహాయం తీసుకోలేదు. యాక్టింగ్ కలను నెరవేర్చుకోవడానికి కిచ్చా ముంబయిలోని రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో చేరాేరు. అక్కడ తన కెమెరా ఫియర్‌ను అధిగమించేందుకు చాలా ప్రాక్టీస్ చేశారు.