War 2 NTR Role: జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ యాక్షన్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ 'వార్ 2'. 2019లో విడుదలైన 'వార్'కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్‌కు సంబంధించిన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉండే ఓ రోల్లో కనిపిస్తారని ఇదివరకు టాక్ నడిచింది. కానీ, బీ టౌన్ వర్గాల ప్రకారం ఈ విషయంలో ఇక్కడే ఓ ట్విస్ట్ దాగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ ఇండియన్ ఏజెంట్ (పోలీస్ ఆఫీసర్) పాత్ర పోషించనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీంతో హృతిక్- తారక్ మధ్య ఎలాంటి విభేదాలు ఉండవని, వీరిద్దరూ సైన్యంలో చేరి శత్రువులతో పోరాడతారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇక 'వార్- 2' సినిమా షూటింగ్ ప్రారంభానికి కూడా సమయం దగ్గరపడింది. ఇదే నెల మార్చి 07న చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. టోక్యోలోని షావోలిన్ టెంపుల్ దగ్గర హృతిక్ ఎంట్రీ సన్నివేశాల చిత్రీకరణ జరుగనుందని సమాచారం. ఇక ప్రస్తుతం దేవర పార్ట్-1 సెట్స్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్, ఏప్రిల్ రెండో వారంలో 'వార్-2' టీమ్‌తో జాయిన్ కానున్నారట. అప్పటి వరకు హృతిక్ రోషన్‌పై సోలో యాక్షన్ సీన్స్ షూట్ చేయనున్నారు.