Vikrant Massey Retirement : బాలీవుడ్ స్టార్ హీరో విక్రాంత్ మాస్సే తాజాగా తన అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ తెలియజేశారు. తాను కొంత కాలంపాటు కొత్త సినిమాలు చేయబోనంటూ విరామం ప్రకటించారు. కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలని అందుకే తాను నటనకు రిటైర్మెంట్ ఇచ్చనంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ ద్వారా షేర్ చేశారు.
"గత కొన్ని సంవత్సరాలుగా మీ అందరి నుంచి అసాధారణమైన ప్రేమను, అభిమానాన్ని నేను పొందుతున్నాను. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. అయితే కుటుంబ సభ్యులకు ఇక నా పూర్తి సమయాన్ని కేటాయించాల్సిన టైమ్ వచ్చింది. అందుకే సినిమాలను ఇక అంగీకరించడం లేదు. 2025లో విడుదల కానున్న సినిమానే నా చివరిది. నేను నటించిన చిత్రాలపై మీరు చూపిన ఆదరాభిమానాలను అస్సలు మర్చిపోలేను. ఎన్నో అందమైన జ్ఞాపకాలను నాకు ఇచ్చారు. మీ అందరికీ కృతజ్ఞతలు" అంటూ ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.
అయితే ఈ పోస్ట్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. సడెస్గా ఈ స్టార్ హీరో ఇటువంటి డెసిషన్ తీసుకోవడం ఏంటని నెట్టింట ఆరా తీస్తున్నారు. మరేదైనా రీజన్ ఉంటే చెప్పండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఇదేదో ప్రమోషనల్ స్టంట్లా ఉందంటూ చెప్పుకుంటున్నారు.