Vikrant Massey 12th Fail OTT : ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తప్పకుండా చూడాల్సిన కొన్ని సినిమాలు ఉంటాయి. అలాంటి వాటిలో ఈ 12th ఫెయిల్ కూడా ఒకటి. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయారు. ప్రధాన పాత్ర పోషించిన విక్రాంత్ మస్సే నటనను తెగ మెచ్చుకున్నారు. చాలా మందికి ఈ చిత్రం ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయింది. అందరూ కంటతడి పెట్టుకున్నారు.
విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎమ్‌డీబీ)లో అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కినెట్టింది. అయితే ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్‍స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 29న కేవలం హిందీ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పుడు తాజాాగా తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. మరి ప్రశంసలతో పాటు ఎన్నో పురస్కారాలు దక్కించుకున్న ఈ 12th ఫెయిల్ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయితే ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.