Vijay Thalapathy The GOAT Movie Collections WorldWide :వెంకట్ ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన సినిమా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'(ది గోట్). సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. అయినప్పటికీ ఈ చిత్రం తొలి రోజు భారీ వసూళ్లను అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 126 కోట్లకుపైగా (గ్రాస్) వసూళ్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వెల్లడించింది.
ఆ ఎపిసోడ్ సూపర్ -విజయ్ మేనరిజంతో పాటు ఆయనపై తెరకెక్కించిన పలు యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు. తండ్రిపై పగను పెంచుకున్న ఓ కొడుకు కథతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే వెంకట్ ప్రభు అందించిన ఈ కథలో కొత్తదనం లేదని అంటున్నారు. అలాగే విజయ్ లుక్‌పై కూడా విమర్శలు చేస్తున్నారు.
రూ.350 కోట్ల బడ్జెట్ - విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు వచ్చిన సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో విజయ్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అందుకు తగ్గట్టే ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రం కోసం విజయ్ రూ.200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.