తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'గోట్​' సినిమాకు విజయ్ భారీ రెమ్యునరేషన్- సగం బడ్జెట్​ కంటే ఎక్కువ! - Vijay Thalapathy Remuneration - VIJAY THALAPATHY REMUNERATION

Vijay Thalapathy Remuneration: కోలీవుడ్ స్టార్ విజయ్- వెంకట్ ప్రభు కాంబోలో తెరకెక్కిన 'గోట్' సెప్టెంబర్ 5 ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు విజయ్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

Vijay Remuneration
Vijay Remuneration (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2024, 5:58 PM IST

Vijay Thalapathy Remuneration:స్టార్ ఇమేజ్ ఆ మజాకా అన్నట్లు! తలపతి విజయ్ 'గోట్' (GOAT) సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ వింటే షాక్ అయిపోతారు. కొద్ది రోజులుగా విజయ్ రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. వాటన్నిటినీ కన్ఫర్మ్ చేస్తూ ప్రొడ్యూసర్ అర్చన కల్పతి అందరిని సర్‌ప్రైజ్ చేశారు. గోట్ సినిమాలో నటించేందుకు తలపతి దాదాపు రూ.200 కోట్ల వరకూ తీసుకుంటున్నారట.

ఈ రెమ్యూనరేషన్ గతంలో ఆయన చేసిన 'బిగిల్' సినిమా మొత్తం బడ్జెట్ కంటే ఎక్కువేనట. విజయ్ తీసుకుంటున్న పారితోషికం బాక్సాఫీస్ టార్గెట్ పెంచేలా ఉందని కల్పతి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒక చిన్న దేశం జీడీపీ కంటే ఎక్కువ పారితోషికం ఇవ్వడం మామూలు విషయం కాదు. ఈ మూవీతో విజయ్ ఇండియా సినిమా చరిత్రలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా నిలిచాడంటే గ్రేటే కదా మరి.

విజయ్‌కు ఇచ్చిన రెమ్యూనరేషన్ గోట్ సినిమా బడ్జెట్​లో సగం కంటే ఎక్కువ అంటే రూ.200కోట్లు. రూ.340 కోట్లతో బడ్జెట్ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే లాభాలను చూశామని, విజయ్ స్టార్ పవర్, ఫ్యాన్ ఫాలోయింగ్‌తో ఇంకా మంచి లాభాలు వచ్చే అవకాశముందని నిర్మాత అర్చన తెలిపారు. ఆగస్టు 17న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ క్షణాల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. 24గంటల్లో 33 మిలియన్ వ్యూస్ సంపాదించుకుని మోస్ట్ వాచ్‌డ్ తమిళ్ ఫిల్మ్ ట్రైలర్‌గా పేరు దక్కించుకుంది.

ఇక పాత్ర విషయానికొస్తే 'గోట్' సినిమాలో విజయ్ స్పెషల్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ మాజీ లీడర్ పాత్ర పోషిస్తున్నారు. తనను వెంటాడుతున్న గతానికి ధీటైన సమాధానం చెప్పేందుకు తన పాత సహచరులందరితో కలిసి పోరాటం చేస్తుంటాడట. సినిమాకు హైలెట్ ఈ స్టోరీలైన్ ఒక్కటే కాదు విజయ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కూడా హైలెట్టే అంటున్నారు ప్రేక్షకాభిమానులు.

ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని భారీ రేంజ్‌లో ముస్తాబు చేశారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్టార్ యాక్టర్ విజయ్ ఒక్కరే కాదు. ఆయనతో పాటు ప్రశాంత్, ప్రభు దేవా, మోహన్, జయరామ్‌లతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దివంగత నటుడు విజయ్ కాంత్‌ను కూడా తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

విజయ్ 'ది గోట్' ట్రైలర్ ఔట్- మీరు చూశారా? - Vijay GOAT Trailer

హీరోయిన్​ రంభ కూతురిని చూశారా - విజయ్ దళపతితో సెల్ఫీ! - Heroine Rambha Daughter

ABOUT THE AUTHOR

...view details