Vijay Sethupathi Nayantara Husband vignesh shivan :విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన మహారాజ చిత్రంతో మరో హిట్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో జరిగిన వివాదంపై మాట్లాడారు. ఆయన్ను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. ఏ నటుడికైనా దర్శకులతో విభేదాలు రావడం సర్వ సాధారణమని అన్నారు.
"నేను రౌడీ మొదటి రోజు చిత్రీకరణ తర్వాత దర్శకుడు విఘ్నేశ్‌కు ఫోన్ చేసి మరీ గొడవ పడ్డాను. నువ్వు నాకు యాక్టింగ్ నేర్పుతున్నావా నేను చేసేది నీకు అర్థం అవ్వడం లేదు అంటూ గట్టిగా అరిచి చెప్పాను. అనంతరం నాలుగు రోజుల తర్వాత నయన్ మా ఇద్దరితో మాట్లాడి సర్దిచెప్పింది. విక్కీ ఆ స్క్రిప్ట్ నాతో చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. అందుకే తక్షణణే అంగీకరించాను. షూటింగ్ మొదలయ్యాక ఆయన్ను అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టింది. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఆ చిత్రంలో నా పాత్రేంటో తెలుసుకోవడానికి నాకు నాలుగు రోజులు టైమ్ పట్టింది. అందులో కొన్ని సీన్స్ చేసేటప్పుడు అభద్రతాభావానికి కూడా లోనయ్యాను. విఘ్నేశ్ టాలెంట్ ఉన్న డైరెక్టర్. ఎవరూ టచ్ చేయని కథలను గొప్పగా తీయగలతాడు. అతడిపై నమ్మకం ఉంచితే చాలు అద్భుతాలు చేస్తాడు" అని ప్రశంసించారు.