Vijay Devarakonda Coldplay Concert : ప్రముఖ బ్రిటీష్ రాక్ బ్యాండ్ కోల్డ్ ప్లే తాజాగా అహ్మదాబాద్‌లో చేసిన చివరి ప్రోగ్రామ్‌తో తమ ఇండియా టూర్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. అయితే ఆ సమయంలో బ్యాండ్ మెంబర్ క్రిస్ మార్టిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
జనవరి 18 నుంచి 26 వరకూ సంగీతప్రియులను ఆకట్టుకున్న ఈ బ్యాండ్ అహ్మదాబాద్‌లోనూ ఓ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌ను అందించింది. దాదాపు లక్ష మందికి పైగా హాజరైన ఈ కాన్సర్ట్‌లో సంగీతప్రియులే కాకుండా, సెలబ్రిటీలూ ఉన్నారు. అయితే ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత క్రిస్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చారు. తమ బ్యాండ్ మెంబర్స్ అందరూ భారతీయులేనని, ఈ విషయం అతికొద్దమందికే తెలుసని సరదాగా చెప్పారు. అంతేకాకుండా తాను తెలంగాణకు చెందినవాడినని పేర్కొన్నారు.
"నా బ్యాండ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. సుమారు 29 ఏళ్ల నుంచి మేము బ్రదర్స్‌లా ఉంటున్నాం. ఈ టీమ్‌లో భాగం కావడం నిజంగా అద్భుతం. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మేము నలుగురం ఇండియాలోనే పుట్టాం. సో, మాది ఇండియన్ బ్యాండే. బేసిస్ట్ బెర్రిమాన్ చూడటానికి స్కాట్లాండ్ వ్యక్తిలా అనిపిస్తుంటాడు కానీ, అతడు తమిళనాడుకు చెందిన వ్యక్తి. నేను తెలంగాణ నుంచి వచ్చాను అని అందరికీ తెలుసు. మా లీడర్ విల్ ఛాంపియన్ మేమంతా ఒక్కటిగా ఉండేలా చూస్తున్నాడు" అంటూ సరదాగా అన్నారు. దీనికి రౌడీ బాయ్ విజయ్ దేవర కొండ స్పందించారు.