Sandeep Vanga Prabhas Spirit Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అన్నీ బడా ప్రాజెక్టులే. అందులో స్పిరిట్ కూడా ఒకటి. అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్ దర్శకుడు సందీప్ వంగా ఈ చిత్రాన్ని భారీ అంచనాలతో తెరకెక్కించనున్నారు. స్పిరిట్ కోసం ఇప్పటికే ఆయన ఓ పవర్‌ఫుల్ కథను రాసుకున్నారట. సినిమాలో ప్రభాస్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించబోతున్నారని సమాచారం. అందులో ఒకటి పోలీస్ పాత్ర అని టాక్ వినిపిస్తోంది. సినిమాలో యాక్షన్ డోస్ హై రేంజ్లో ఉంటుందని అంటున్నారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రభాస్‌తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలనూ సందీప్ వంగా తీసుకోబోతున్నారని తెలిసింది. వారు మరెవరో కాదు విజయ్ దేవరకొండ, రణ్‌బీర్ కపూర్. వీరిద్దరు కేమియో రోల్ చేస్తారని సమాచారం అందింది. గతంలో వీరిద్దరితో సందీప్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి చేసి దర్శకుడిగా వెలుగులోకి వచ్చారు సందీప్ వంగా. ఆ తర్వాత ఇదే సినిమా హిందీలో కబీర్ సింగ్‌గా తీసి బాలీవుడ్‌లోనూ హిట్ అందుకున్నారు. అనంతరం రణ్‌బీర్ కపూర్‌తో వైలెన్స్గా యానిమల్ తీసి భారీ బ్లాక్ బస్టర్‌ను అందుకున్నారు. అలా తాను గతంలో చేసిన సినిమాల హీరోలను స్పిరిట్లోనూ చూపించాలని సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నారట. అలానే స్పిరిట్‌లో ఓ స్టార్ హీరోను విలన్ పాత్రలో నటింపజేయాలని సందీప్ రెడ్డి ప్రయత్నిస్తున్నారట. ఇది తెలుసుకుంటున్న సినీ ప్రియులు, అభిమానులు సందీప్ రెడ్డి ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారనే టాక్ సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది.
ఇకపోతే ఈ చిత్రాన్ని టీ-సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. సినిమకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మొదటి నుంచి మూవీటీమ్ చెబుతోంది. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబు కానున్న ఈ చిత్రంతోనే ప్రభాస్ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు.