Vijay Devarakonda VD 14 Title :రౌడీ హీరోవిజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ కాంబోలో ఓ పీరియాడికల్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. విజయ్ బర్త్‌డే సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మేకర్స్ ఈ సినిమా గురించి అనౌన్స్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఓ సాలిడ్ పోస్టర్‌తో పాటు స్టోరీ లైన్‌ను రివీల్ చేసి మూవీ లవర్స్‌లో మరింత ఆసక్తిని పెంచారు.
ఇప్పటికే ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు శరవేగంగా జరగుతుండగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ రూమర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. మేకర్స్ ఈ మూవీకి ఓ సాలిడ్ టైటిల్‌ను ఫిక్స్ చేసే పనిలో ఉన్నారట. ప్రస్తుతానికి 'VD 14' అని పిలుస్తున్న ఈ సినిమాకు 'రణబలి' అనే పేరును ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. ఇదే కాకుండా మరో రెండు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట. చూడాలి మరి ఈ ఏదీ ఫిక్స్ చేయనున్నారో?
ఇక VD 14 విషయానికి వస్తే, 1854 నుంచి 1878 మధ్యలో జరిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో విజయ్ తండ్రిగా, కొడుకుగా ఇలా డ్యూయల్ రోల్లో కనిపించనున్నారట. ఇక ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్‌లో మొదలయ్యే అవకాశం ఉంది.
మరోవైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్లో బిజీగా ఉన్నారు. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ వైజాగ్‌లో జరుగుతోంది. ఇందులో విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత విజయ్ 'రాజావారు రాణివారు' మూవీ ఫేమ్ రవికిరణ్ కోలాతో మరో చిత్రం చేయనున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీని దిల్ రాజు వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కింద నిర్మిస్తున్నారు.