తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సినిమా బడ్జెట్ సమానంగా హీరోల రెమ్యూనరేషన్​! - ఓటీటీ వేదికలు వెనక్కి తగ్గితే వాళ్లు ఏం చేయాలి : వెట్రిమారన్ - Vetrimaaran Directors Uncut

Vetrimaaran About Heros Remuneration : టాప్ హీరోల రెమ్యూనరేషన్​ గురించి కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తారలు తమ పారితోషికాలు తగ్గించుకొని, థియేట్రికల్‌ మార్కెట్‌ను ప్రోత్సహించాలంటూ వెట్రిమారన్‌ అన్నారు.

Vetrimaaran About Heros Remuneration
Vetrimaaran (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2024, 3:56 PM IST

Vetrimaaran About Heros Remuneration : కరోనా లాంటి పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత థియేటర్ల మార్కెట్‌ అలాగే ఇండస్ట్రీ భారీ కుదుపునకు లోనైందని, దీంతో పాటు స్టార హీరోల రెమ్యూనరేషన్ లాంటి అంశాలు సినిమా విజయావకాశాలపై ప్రభావం చూపుతోందంటూ కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్‌ అభిప్రాయపడ్డారు. ఓ పాపులర్ సినీ ఆంగ్ల మ్యాగజైన్‌ నిర్వహించిన 'డైరెక్టర్స్‌ అన్‌కట్‌' అనే రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయం గురించి ప్రస్తావించారు. ఇక ఈ మీటింగ్​లో వెట్రిమారన్​తో పాటు పా.రంజిత్‌, జోయా అక్తర్‌, కరణ్‌ జోహార్‌, మహేశ్‌ నారాయణ్‌లు లాంటివారు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రస్తుత పరిస్థితిని థియేట్రికల్‌ బాక్సాఫీస్‌ ఫెయిల్‌ అని మనం అనలేం. ఇది ఓటీటీ సంస్థలు సృష్టించిన మాయాజాలం. కరోనా సమయంలో ఎదురైన పరిస్థితులను అవి బాగా ఒడిసిపట్టాయి. వాళ్లు వచ్చి 'రజనీకాంత్‌, విజయ్‌లు నటించే సినిమాలకు మేము రూ.120కోట్లు ఇస్తాం. మీరు మూవీ తీయండి' అని అంటారు. దీంతో బడ్జెట్‌ కూడా అమాంతం పెరుగుతోంది. అలాగే రెమ్యూనరేషన్లు కూడా. అయితే కొన్ని నెలలకే అది సరైనది కాదని వాళ్లు (ఓటీటీ వేదికలు) కూడా తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత వచ్చి 'మేము అంత మొత్తం ఇచ్చుకోలేము' అని అంటున్నారు. అప్పటికే నిర్మాత భారీ బడ్జెట్‌తో మూవీ తీసేందుకు రెడీగా ఉంటారు. అదే కాకుండా నటులుతోనూ కోరినంత పారితోషికాలు ఇచ్చేస్తామన్న అగ్రిమెంట్‌ కూడా అయిపోయి ఉంటుంది. అటువంటి సమయంలోనే ఓటీటీ వేదికలు వెనక్కి తగ్గితే నిర్మాత ఏం చేయాలి?" అని వెట్రిమారన్‌ అన్నారు.

ఇదే వేదికపై డైరెక్టర్ మారి సెల్వరాజ్​ను వెట్రిమారన్ కొనియాడారు. చిన్న బడ్జెట్‌ మూవీలను చేస్తూ రెండింతల లాభం ఆర్జిస్తున్నారంటూ మెచ్చుకున్నారు. "మారి సెల్వరాజ్‌ తీసిన 'వాఝై'లాంటి చిత్రాలకు బాగా లాభాలు వచ్చాయి. మంచి సినిమాలు తీస్తే థియేటర్‌కు వచ్చి చూసే ప్రేక్షకులూ ఉన్నారు. ఈ విషయాన్ని మనం పునః సమీక్షించుకోవాలి. థియేటర్‌లో సినిమా చూసేందుకు వచ్చేలా ప్రేక్షకులను ప్రోత్సహించాలి. సిల్వర్ స్క్రీన్​ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు తీయాలి. ఇక సెన్సార్‌షిప్‌ విషయంలో ఓటీటీ సంస్థలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. ఇదే ట్రెండ్‌ హాలీవుడ్‌లోనూ వచ్చింది. ఇప్పుడు వాళ్లు వాటిని సరిచేసుకుని హాలీవుడ్‌లో అగ్ర నటుల సేవలకు తగిన మొత్తంలో పారితోషికాలు చెల్లిస్తున్నారు. అయితే సినిమా క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా అనుకున్న బడ్జెట్‌ కన్నా కూడా కాస్త ఎక్కువే ఇస్తున్నారు డైరెక్టర్లు. అందుకే నెట్‌ఫ్లిక్స్‌ వంటి సంస్థలకు ట్రాన్స్​పరెంట్ వ్యూవర్‌షిప్‌ ఉంటుంది. సరైన ట్యాలెంట్​ను ఎలా ఉపయోగించుకోవాలో వాళ్లకు బాగా తెలుసు" అని వెట్రిమారన్‌ పేర్కొన్నారు.

సినిమా బడ్జెట్ రూ. 40 కోట్లు - పారితోషకం అంతే!
సినీ తారల రెమ్యూనరేషన్​ పెంపు విషయంలో జరిగిన తప్పిదాలను తాను సరిదిద్దుతున్నట్లు నిర్మాత కరణ్‌ జోహార్‌ వెల్లడించారు. అందుకు 'కిల్‌' మూవీ ఉదాహరణ అని అన్నారు. ఆ మూవీకి తాను అనుకున్న బడ్జెట్‌ రూ.40కోట్లు అని, అయితే అంతే రెమ్యూనరేషన్‌ కావాలంటూ కొందరు స్టార్‌లు అడగటం వల్ల కొత్త నటులను పెట్టి ఆ చిత్రాన్ని తీసినట్లు చెప్పారు.

ఇక ఈ చర్చల సందర్భంగా "సినిమాకు రూ.40కోట్లు, మీ పారితోషికం రూ.40కోట్లు. కలెక్షన్లు రూ.120 కోట్లు వస్తాయని మీరు గ్యారెంటీ ఇస్తారా?" అంటూ నేను అడిగితే, వాళ్లేమీ మాట్లాడలేదు. ఎందుకంటే అలా అయ్యే పని కాదు" అని కరణ్‌ వ్యాఖ్యానించారు.

'గోట్​' సినిమాకు విజయ్ భారీ రెమ్యునరేషన్- సగం బడ్జెట్​ కంటే ఎక్కువ! - Vijay Thalapathy Remuneration

40ల్లోనూ త్రిష సూపర్ క్రేజ్​- ఒక్కో సినిమా రెమ్యూనరేషన్ ఎంతంటే? - Trisha Krishnan Networth

ABOUT THE AUTHOR

...view details