తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సింపుల్​గా హీరో వెంకటేశ్‌ రెండో కుమార్తె వివాహం - ఎవరెవరు హాజరయ్యారంటే? - Venkatesh Second Daughter Marriage

Venkatesh Second Daughter Marriage : హీరో విక్టరీ వెంకటేశ్‌ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె హయవాహిని వివాహం సింపుల్​గా జరిగింది. ఆ వివరాలు.

.
సింపుల్​గా హీరో వెంకటేశ్‌ రెండో కుమార్తె వివాహం

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 8:24 AM IST

Updated : Mar 16, 2024, 2:35 PM IST

Venkatesh Second Daughter Marriage : టాలీవుడ్‌ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్‌ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె హయవాహిని వివాహం సింపుల్​గా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌ కుమారుడు నిషాంత్‌తో పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రామానాయుడు స్టూడియోలో ఈ వివాహ వేడుకను జరిపించారు. ఎలాంటి హడావిడి లేకుండా శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు ఈ పెళ్లి జరిగినట్లు తెలిసింది. సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించిన సెల‌బ్రిటీలు ఎవ‌రు పెద్ద‌గా హాజ‌రైన‌ట్టు కనిపించలేదు. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వెంకటేశ్ అభిమానులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక గురువారం జరిగిన మెహందీ ఫంక్షన్​లో సూపర్ స్టార్ మహేశ్​ బాబు కుటుంబ సభ్యులు సందడి చేశారు. మహేశ్​ సతీమణి నమ్రత, ఆయన కూతురు సితార మెహందీ వేడుకలలో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు.

కాగా, గతేడాది అక్టోబర్‌లో నిషాంత్‌, హయవాహినిల ఎంగేజ్​మెంట్ జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, రానా, అక్కినేని నాగచైతన్య హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి వేడుకలో సందడి చేశారు. ఇకపోతే వెంకటేశ్‌, నీరజ దంపతులకు నలుగురు సంతానం. ఆశ్రిత, హయవాహిని, భావనతో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లి 2019లో జరిగింది. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉంటోంది.

ఇక వెంకీ పెద్ద కూతురు ఆశ్రితకు 2019లో పెళ్లి జరిగింది. ప్రస్తుతం భర్తతో కలిసి ఆమె విదేశాల్లోనే ఉంటున్నారు. ఆశ్రిత ఫుడ్ బ్లాగర్ అన్న సంగతి తెలిసిందే. రకరకాల వంటకాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసుకుంటుంటారు. గతంలో రానా, నాగచైతన్య, వెంకీతో కలిసి కూడా వంటకాలు ప్రీపేర్ చేస్తూ వీడియోస్ చేశారు. ఇకపోతే వెంకటేశ్ సినిమాల విషయానికొస్తే ఆ మధ్య ఎఫ్​ 2, దృశ్యం 2 వంటి చిత్రాలతో హిట్ అందుకున్న వెంకీ మామ ఆ తర్వాత రీసెంట్​గా సైంధవ్​తో సంక్రాంతికి వచ్చారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.

సింపుల్​గా హీరో వెంకటేశ్‌ రెండో కుమార్తె వివాహం

దీపికా పదుకొణె - 'కల్కి' కన్నా ముందే నటించిన తొలి తెలుగు సినిమా ఏంటో తెలుసా?

డేంజర్ జోన్​లో ఈ దర్శకులు - మళ్లీ హిట్​ కొడితేనే రేసులోకి!

Last Updated : Mar 16, 2024, 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details