Venkatesh Anil Ravipudi Movie : విక్టరీ వెంకటేశ్ - అనిల్ రావిపూడి కాంబోలో మరో సినిమా రెడీ అవుతోంది. ఈ కాంబినేషన్లో రానున్న మూడో చిత్రాన్ని తాజాగా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. వెంకీఅనిల్3 అనే వర్కింగ్ టైటిల్‌తో ఎఫ్2, ఎఫ్3ను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్సే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎంటర్‌టైన్‍మెంట్ పంచేందుకు మళ్లీ అద్భుతమైన కాంబో వచ్చేస్తోంది. ఎస్‍వీసీ బ్యానర్లో విక్టరీ వెంకటేశ్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ కొట్టేందుకు చేతులు కలిపారు అంటూ రాసుకొచ్చారు మేకర్స్. మాజీ పోలీస్, మాజీ గర్ల్ ఫ్రెండ్, అద్భుతమైన భార్య ఈసారి అద్భుతమైన ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌తో వచ్చేస్తున్నారు అంటూ వీడియో కూడా షేర్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Gopichand Bheema Movie OTT : మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా నటించిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా భీమా మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ అనుకున్న స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఏప్రిల్ 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని హాట్‍స్టార్ నేడు (ఏప్రిల్ 9) అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. కాబట్టి థియేటర్లలో మిస్ అయిన వారు ఈ సినిమాను ఓటీటీలో చూసేయండి.