తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వాలైంటైన్స్​ డే స్పెషల్ - రీ రిలీజ్​కు రెడీగా ఉన్న లవ్​ మూవీస్ ఇవే - లవర్స్ డే రీ రిలీజ్ సినిమాలు

Valentines Day Re Release Movies : ప్రేమికుల రోజును స్పెషల్​గా జరుపుకునేందుకు లవర్స్​ రకరకాలుగా ప్లాన్​ చేసుకుంటారు. కొందరూ పార్కులకు, రెస్టారెంట్లకు వెళ్తారు. మరికొందరేమో సినిమాలను చూసేందుకు థియేటర్స్​కు వెళ్తుంటారు. అయితే తాజాగా పలు క్లాసిక్ లవ్​​ మూవీస్​లు రీ రిలీజ్​కు సిద్ధమవుతున్నాయి. ఆ చిత్రాలు ఎంటో ఓ సారి లుక్కేద్దాం.

Valentines Day Re Release Movies
Valentines Day Re Release Movies

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 8:19 PM IST

Valentines Day Re Release Movies : ప్రస్తుతం టాలీవుడ్​లో రీ రిలీజ్​ మేనియా నడుస్తోంది. ఇంతకుముందు థియేటర్స్​లో విడుదలైన మిక్స్​డ్​ టాక్ తెచ్చుకున్న కొన్ని సినిమాలు రీ రిలీజ్​లో మంచి రెస్పాన్స్​ను అందుకుంటున్నాయి. అలానే కలెక్షన్స్ కూడా బాగానే వసూలు చేస్తున్నాయి. అయితే ఈ ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా పలు చిత్రాలను రీ రిలీజ్ చేసందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. అవేంటంటే ?

ప్రేమ కథల్లో పవన్ కల్యాణ్​ సినిమా 'తొలి ప్రేమ'కు ప్రత్యేక స్థానం ఉంది. 1998లో బ్లాక్​బస్టర్ అందుకున్న ఈ సినిమాను లవర్స్ డే సందర్భంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు సిద్దార్థ్, బేబీ షామిలి జంటగా నటించిన 'ఓయ్' సినిమాను కూడా వాలెంటైన్స్ డే రోజు రీ రీలీజ్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు.

ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, గౌతమ్​ వాసుదేవ్ మేనన్​ కాంబోలో 2008లో వచ్చిన సినిమా 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'. ఈ సినిమా గతేడాది ఆగస్టు 4న రీ రిలిజ్ అయ్యింది. అప్పుడు ఊహించని రెస్పాన్స్​ అందుకుంది. అయితే ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

ఇటీవలే విడుదలై పాన్ ఇండియా లెవల్లో భారీ బ్లాక్ బస్టర్​గా నిలిచినా 'సీతారామం' సినిమా కూడా లవర్స్​ డే రోజు రీ రిలీజ్ కానుంది. అలానే సిద్ధార్​, త్రిష జంటగా నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', పన్నెండేళ్ల క్రితం శర్వానంద్, అంజలి జై కాంబినేషన్​లో వచ్చిన 'జర్నీ' సినిమా కూడా రీ రిలీజ్ కానున్నాయి.

అయితే ఈ రీ రిలీజ్ ట్రెండ్ కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్​లోనూ ఉంది. ఈ ప్రేమికుల రోజు సందర్బంగా హిందీలో పలు ప్రేమ కథ చిత్రాలు రీ రిలీజ్​ కానున్నాయి. వాటిలో 'దిల్​వాలే దుల్హనియా లేజాయేంగే', 'దిల్ తో పాగల్ హై', 'మొహబ్బతే' లాంటి సినిమాలున్నాయి. మరి ప్రేమికుల రోజున మీరు ఏ సినిమా చూసేందుకు రెడీగా ఉన్నారు మరి ?

తెలుగు నిర్మాతలతో కోలీవుడ్ స్టార్స్ - ఈ కాంబో సూపర్ హిట్టే!

'12th ఫెయిల్' సెన్సేషన్​ - ఆ లిస్ట్​లో ఏకైక ఇండియన్ సినిమాగా రికార్డు

ABOUT THE AUTHOR

...view details