Upasana Latest tweet :తన పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫషనల్ లైఫ్‌కు సంబంధించిన అనేక విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు మెగా కోడలు ఉపాసన. ఇక క్లీంకార పుట్టాక పలు ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేసినప్పటికీ అందులో ఆ చిన్నారి ఫేస్‌ను మాత్రం రివీల్ చేయలేదు. దీంతో చెర్రీ గారాల పట్టీ ఎలా ఉండనుందో అంటూ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.
అయితే తాజాగా రామ్‌చరణ్ దంపతులు ఓ ఫ్యామిలీ ఈవెంట్లో పాల్గొన్నారు. అక్కడ తీసిన ఓ ఫొటోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉపాసన సిస్టర్ అనుష్పాల ఫ్యామిలీతో కలిసి చెర్రీ దంపతులు దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు.
"ఈ రోజు నేను మీకు అద్భుతమైన ముగ్గురు చిన్నారి బాలికలను పరిచయం చేస్తున్నాం. పవర్ పఫ్ గర్ల్స్ . క్లీంకార కొణిదెల ఇప్పుడు తన ఇద్దరు చెల్లెళ్లు ఐరా పుష్ప ఇబ్రహీం, రైకా సుచరిత ఇబ్రహీంలను కలుసుకుంది" అంటూ ఓ క్యూట్ క్యాఫ్షన్ను రాసుకొచ్చారు.
ఇక ఈ ఫొటోలో చెర్రీ తన గారాల పట్టిని ఎత్తుకుని ఎంతో ఆనందంగా ఫొటోకు ఫోజిచ్చారు. అయితే ఇక్కడ కూడా ఈ దంపతులు క్లీంకార ఫేస్ రివీల్ కాకుండా జాగ్రత్తపడ్డారు. ఇది చూసిన కొందరు ఫ్యాన్స్ 'క్యూట్', 'బ్యూటీఫుల్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో ఎప్పుడు చిన్నారి ఫేస్ రివీల్ చేస్తారంటూ అడుగుతున్నారు.