Tripti Dimri Marriage :బాలీవుడ్ స్టార్ హీరోరణ్‌బీర్ కపూర్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'యానిమల్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు టాక్ పరంగానే కాకుండా ఇటు కలెక్షన్ల పరంగానూ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ మంచి రేటింగ్స్‌తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాలోని కొందరు తారలు తమ నటనతో ఓవర్‌నైట్ స్టార్స్ అయిపోయారు. అందులో బీటౌన్ బ్యూటీ తృప్తి దిమ్రి ఒకరు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ బ్యూటీ 'యానిమల్' సినిమాలో జోయా అనే పాత్రలో మెరిసింది. తన నటనతో ఆడియెన్స్‌ను ఆకర్షించింది. దీంతో ఈ అమ్మడిని ఇప్పుడు వరుస ఆఫర్లు వరిస్తోంది.
ఇదిలా ఉండగా, తాజాగా ఈ అమ్మడు పెళ్లి పీటలెక్కనుందన్న వార్తలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆమెను ఇటీవలే ఓ యాంకర్ ప్రశ్న అడిగారు. దీంతో ఆమె తన మనసులోని మాట బయటపెట్టింది. పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చింది.
"మీరెప్పుడు పెండ్లి చేసుకుంటారు" అంటూ యాంకర్ తృప్తిని ప్రశ్నించగా, ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమి లేదని, ఇప్పటికైతే తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టానంటూ తృప్తి క్లారిటీ ఇచ్చింది. అయితే తనకు కాబోయే భర్తలో ఏయే క్వాలిటీస్ ఉండాలో చెప్పుకొచ్చింది. "డబ్బు, పాపులారిటీ సంగతి పక్కన పెడితే అతడు మంచి మనస్సున్న వ్యక్తి అయి ఉండాలి" అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేసింది.