Horror Movie The First Omen OTT Release : ఓటీటీలో హారర్ జానర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. భయపెట్టే కాన్సెప్ట్‌తో వచ్చే చిత్రాలు, సిరీస్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అందుకే థ్రిల్లింగ్‌గా, ఇంట్రెస్టింగ్గా, సస్పెన్స్ అంశాలతో ఉంటే ఈ హారర్ మూవీస్‌ను చూసేందుకు ఆడియెన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
అందుకే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా కంటెంట్‌ను తీసుకొస్తున్నాయి. అలా రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఓ హారర్ మూవీనే ది ఫస్ట్ ఒమెన్. హాలీవుడ్లో ఒమెన్ ఫ్రాంఛైజీకి మంచి ప్రేక్షకాదరణ ఉంది. ఇప్పుడీ ఫ్రాంఛైజీ నుంచి ఆరో సినిమాగా ది ఫస్ట్ ఒమెన్ రాబోతుంది. ముందుగా ఏప్రిల్ 4న ఇటలీలో రిలీజ్ చేయగా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అనంతరం ఏప్రిల్ 5న అమెరికాలోనూ విడుదల చేయగా బానే హిట్ అయింది. ఇప్పుడు మే 30 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటర్నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్ అవుతూ దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతానికి ఈ హారర్ సినిమా కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు స్ట్రీమింగ్ అందుబాటులో లేదు. కాగా ఈ సినిమాకు అర్కాషా స్టీవెన్సన్ డైరెక్షన్ చేశాయి. బెన్ జాకోబీ కథ అందించారు. తౌఫీక్ బర్హోమ్, టైగర్ ఫ్రీ, రాల్ఫ్ ఇనెసన్, సోనియా బ్రాగా, బిల్ నైఘీ ఇతరులు కీలక పాత్రలు చేశారు. టిమ్ స్మిత్, కీత్ థామస్ స్క్రీన్ ప్లే అందించారు.