తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'చరిత్రలో మిగిలిపోవాలంతే!'- పొలిటికల్ థ్రిల్లర్​గా 'గ్యాంగ్స్​ ఆఫ్ గోదావరి' - Gangs of Godavari Trailer - GANGS OF GODAVARI TRAILER

Gangs of Godavari Trailer: టాలీవుడ్ స్టార్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ శనివారం రిలీజైంది. మీరు చూశారా?

Gangs of Godavari Trailer
Gangs of Godavari Trailer (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 7:33 PM IST

Updated : May 25, 2024, 10:30 PM IST

Gangs of Godavari Trailer:టాలీవుడ్ స్టార్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్​గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే గ్లింప్స్, పాటలు విడుదల చేసిన మూవీ టీమ్ శనివారం ట్రైలర్ రిలీజ్ చేసింది. హైదరాబాద్​లో మూవీ టీమ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి. మరి మీరు ఈ ట్రైలర్ చూశారా?

లంక గ్రామానికి చెందిన రత్న అనే యువకుడి కథే ఈ సినిమా. 'మనుషులు మూడు రకాలు' అనే డైలాగ్​తో ట్రైలర్ మొదలైంది. ట్రైలర్​లో యాక్షన్, ఎమోషన్స్ బాగానే చూపించారు. ఈ సినిమాలో విశ్వక్ రాజకీయ నేతగా కనిపించనున్నారు. రాజకీయాల్లో ఎదురయ్యే పోటీ, సమస్యలను యువ నాయకుడు ఎలా ఎదుర్కోనున్నాడు. అతడికి కమెడియన్ హైపర్ ఆది సలహాలు ఇస్తుంటాడు. ఇక రత్న, హీరోయిన్​తో ప్రేమాయణం ఎలా నడిపించనున్నాడన్నది ఆసక్తికరంగా ఉంది. నటి అంజలి కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఇక విశ్వక్ మళ్లీ కొన్ని బూతు డైలాగ్స్​ డోస్ పెంచారు. ట్రైలర్​లో అయితే విశ్వక్ వన్​మ్యాన్ షోగా కనిపిస్తోంది. 'మనుషుల్లో మూడు రకాలు. ఒకటి ఆడ, ఇంకొకటి మగ, మరొకటి పొలిటిషియన్' డైలాగ్స్ ట్రైలర్​కు హైలైట్​గా నిలిచింది.

ఇక ఇప్పటికే రిలీజైన టీజర్​కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజా ట్రైలర్​కు కూడా పాజిటివ్ రెస్పాన్ వస్తోంది. ఈ సినిమాలో నేహ శెట్టి హీరోయిన్​గా నటించింది. 'మోత' స్పెషల్ సాంగ్​లో యంగ్ బ్యూటీ ఆయేషా ఖాన్ ఆడిపాడింది. సీనియర్ నటులు నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది, గోపరాజు రమణ తదితరులు ఆయా పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమా బ్యానర్​పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు యువన్​ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. కాగా, ఆయా కారణాల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా వరల్డ్​వైడ్​గా మే 31న రిలీజ్ కానుంది.

విశ్వక్​ సేన్ నిర్ణయం- ఐదు సినిమాలకు ఇబ్బంది! - Vishwak Sen Gangs Of Godavari

తేడా వస్తే నవ్వుతా నరాలు తీస్తాం.. విశ్వక్​ సేన్ పవర్​ఫుల్ వార్నింగ్​ ఎవరికో?

Last Updated : May 25, 2024, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details