తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

టాలీవుడ్ నెక్ట్స్​ సెంచరీ కొట్టే హీరో అతడేనా? - Tollywood Tier 2 Heroes - TOLLYWOOD TIER 2 HEROES

Tollywood Tier 2 Heroes 100 Crore Collection : టాలీవుడ్​లో ఇప్పుడు వంద కోట్ల క్లబ్ అంటే కేవలం టాప్ హీరోలకే పరిమితం కాలేదు అప్ కమింగ్ హీరోలు కూడా చాలామంది ఆ క్లబ్​లో వరుసగా చేరుతున్నారు. రీసెంట్​గా డీజే టిల్లు కుడా అందులో చేరిపోయాడు. ఇక మిగిలింది అతడేనా?

టాలీవుడ్ నెక్ట్స్​ సెంచరీ కొట్టే హీరో అతడేనా?
టాలీవుడ్ నెక్ట్స్​ సెంచరీ కొట్టే హీరో అతడేనా?

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 11:58 AM IST

Tollywood Tier 2 Heroes 100 Crore Collection : 11 ఏళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ టాలీవుడ్​లో మొదటిసారిగా అత్తారింటికి దారేది సినిమాతో వంద కోట్ల మైల్ స్టోన్ దాటారు. ఆ తరువాత ఈ వంద కోట్ల క్లబ్​లో చాలా మంది టాప్ హీరోలు వచ్చి చేరారు. అయితే ఈమధ్య చాలామంది యంగ్ హీరోలు, అప్ కమింగ్ స్టార్ హీరోలు కూడా తమ సూపర్ హిట్ సినిమాలతో వంద కోట్ల క్లబ్​లో చేరిపోయారు.

రీసెంట్​గా సిద్ధు జొన్నలగడ్డ DJ టిల్లు స్క్వేర్ సినిమాతో కేవలం 9 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరాడు. బాక్సాఫీస్ ముందు మోత మోగించేశాడు. ఈ చిత్రం ఇప్పటికీ ఇంకా థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్​అవుతూనే ఉంది. అంతకుముందు ఈ ఏడాది సంక్రాంతికి తేజ సజ్జా కూడా హనుమాన్​తో పాన్ ఇండియా లెవల్​లో ఏకంగా రూ.300 కోట్ల వరకు వసూలు చేశాడు. ఇంకా పలువురు హీరోలు కూడా ఈ మార్క్​ను టచ్ చేసేశారు.

  • విజయ్ దేవరకొండ: అర్జున్ రెడ్డితో కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ గీత గోవిందంతో 100 కోట్ల క్లబ్​లో చేరాడు. ఈ సినిమా అతని మార్కెట్​ను కూడా భారీగా పెంచింది. కానీ ఇప్పుడు రూ.100 కోట్ల అందుకునేందుకు తెగ కష్టపడుతున్నాడు.
  • వరుణ్ తేజ్: ఫిదా సినిమాతో హీరోగా మొదటి సూపర్ హిట్ అందుకున్న వరుణ్ ఎఫ్ 2 సినిమాతో విక్టరీ వెంకటేష్​తో స్క్రీన్ పంచుకున్నాడు. ఆ సినిమాతో వంద కోట్ల క్లబ్​లో వరుణ్ కూడా చేరిపోయాడు.
  • నిఖిల్: హ్యాపీ డేస్​తో పరిచయమైన నిఖిల్ నటించిన కార్తికేయ సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన కార్తికేయ2 పాన్ ఇండియా హిట్ అయ్యి నిఖిల్​ను వంద కోట్ల హీరో చేసింది.
  • రవితేజ: రెండు దశాబ్దాలుగా హీరోగా టాలీవుడ్​లో గుర్తుండిపోయే పాత్రలు చేసిన రవితేజ ధమాకాతో వంద కోట్ల క్లబ్​లో చేరాడు.
  • వైష్ణవ్ తేజ్: మొదటి సినిమా ఉప్పెనతోనే వంద కోట్ల క్లబ్​లో చేరాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్.
  • నాని: సహజంగా నటిస్తాడనే పేరు తెచ్చుకున్న నాని దసరా సినిమాతో వంద కోట్ల హీరోగా ఎదిగారు.
  • అడివి శేష్: ఇక టాలీవుడ్​ టైర్​ 2 హీరోల్లో మిగిలింది అడివి శేష్ మాత్రమనే చెప్పాలి. ఈ టాలెంట్​ హీరో గూఢచారి, మేజర్, క్షణం లాంటి సినిమాలతో హీరోగానే కాదు రైటర్​ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మధ్య మేజర్ దాదాపు రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడు ఆయన నుంచి గూఢచారి 2తో రాబోతుంది. దీంతో మరోసారి ఆయన సూపర్ హిట్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో టాలీవుడ్​లో నెక్స్ట్ సెంచరీ కొట్టబోయే హీరో ఆయనే అని సినీ ప్రియులు అనుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details