Mahesh Babu Son Gautam First Performance:సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ తన కెరీర్లో తొలిసారి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లండన్ యూనికార్న్ థియేటర్‌లో గౌతమ్ ఘట్టమనేని పెర్ఫార్మెన్స్ చేశాడు. తమ ముద్దుల కుమారుడి టాలెండ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు మహేశ్ ఫ్యామిలీ లండన్ వెళ్లిపోయింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ మొత్తం కలిసి దిగిన ఫొటోలను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ షోకు మహేశ్, నమ్రతతోపాటు సితారా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ హాజరయ్యారు.
లండన్‌లో గౌతమ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్- సూపర్ స్టార్ కొడుకు ఆర్టిస్ట్ అయ్యాడుగా! - Gautam Ghattamaneni - GAUTAM GHATTAMANENI
Mahesh Babu Son Gautam First Performance: ఇటీవల గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న గౌతమ్ ఘట్టమనేని, రీసెంట్గా లండన్‌లో స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తమ కుమారుడి తొలి పెర్ఫార్మెన్స్ చూసేందుకు హీరో మహేశ్ బాబు ఫ్యామిలీతో సహా అక్కడికి వెళ్లారు.
Published : Jun 23, 2024, 10:04 AM IST
'ఇదొక ప్రత్యేకమైన సాయంత్రం. గౌతమ్ ఘట్టమనేనిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. లండన్ వేదికగా తన తొలి థియేటర్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ జరిగింది. చాలా బాగా అనిపించింది. లవ్ యూ మోర్ నాన్నా. చిన్నారులంతా ఈ సమ్మర్ ప్రోగ్రామ్‌లో పాల్గొని తమతమ టాలెంట్ ప్రపంచానికి పరిచయం చేసుకోవాలని ఆకాంక్షిస్తూన్నా. స్పెషల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్య సంతోషంగా, హాయిగా అనిపించింది' అని నమ్రత పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. గౌతమ్‌కు మహేశ్ బాబు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే గౌతమ్ ఇప్పటికే టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చేడు. '1 నేనొక్కడినే' సినిమాలో జూనియర్ మహేశ్‌గా కనిపించాడు. ఇక గౌతమ్ ఇటీవల గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌కు కూడా మహేశ్, నమ్రత హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు మహేశ్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'గర్వంతో నా హృదయం ఉప్పొంగుతోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు అభినందనలు, తర్వాతి అధ్యాయం నీ చేతుల్లోనే ఉంది. మరిన్ని శిఖరాలను అధిరోహిస్తావని ఆశిస్తున్నా. ఒక తండ్రిగా నిన్ను చూసి గర్వపడుతున్నా' అంటూ పోస్టు చేశారు.