తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అప్​డేట్స్ ఊసే ఎత్తని యంగ్​ హీరోలు - ఇంకెప్పుడు చెప్తారో ? - టాలీవుడ్ హీరోల అప్​కమింగ్ మూవీస్

Tollywood Heros Upcoming Projects : టాలీవుడ్​కు చెందిన కొంతమంది హీరోలు తమ అప్​కమింగ్ ప్రాజెక్ట్స్​ గురంచి ఊసే ఎత్తడం లేదు. గతంలో అనౌన్స్​ చేసిన ప్రాజెక్ట్స్​కు సంబంధించిన అప్​డేట్స్​ కూడా రావట్లేదు. దీంతో ఫ్యాన్స్​ డీలా పడుతున్నారు.

Tollywood Heros Upcoming Projects
Tollywood Heros Upcoming Projects

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 9:28 AM IST

Updated : Feb 24, 2024, 9:35 AM IST

Tollywood Heros Upcoming Projects : టాలీవుడ్​లో ఎంతో మంది స్టార్స్​ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో కొంత మంది ఇప్పటికే చేతినిండా సినిమాల షూటింగులతో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి బడా హీరోలు తమ సినిమా అప్​డేట్స్​ ఇచ్చి ఫ్యాన్స్​ను ఉత్తేజ పరచగా, యంగ్​ హీరోలైన నాని, నాగ చైతన్య కూడా తమ కొత్త చిత్రాల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ఇప్పటికీ తెలుగులో పలువురు హీరోల సినిమాల విషయంలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. దీంతో వాళ్ల కొత్త సినిమాల విశేషాలేంటి? ఎప్పట్నుంచి సెట్స్‌లోకి అడుగు పెడతారన్న అంశాలు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

'విరూపాక్ష', 'బ్రో' సినిమాలతో గతేడాది బాక్సాఫీస్‌ ముందు జోరు చూపించారు యంగ్​ హీరో సాయిధరమ్​ తేజ్​. అయితే ఆ తర్వాత ఆయన అప్​కమింగ్​ మూవీస్​ గురించి ఎటువంటి అప్​డేట్ రాలేదు. తాజాగా సంపత్‌ నంది తెరకెక్కించనున్న 'గాంజా శంకర్‌' సినిమాలో తేజు లీడ్​ రోల్​ అన్నప్పటికీ ఈ సినిమా విషయంలో అనేక సందిగ్ధతలు నెలకొన్నాయి. టైటిల్​ నుంచి గాంజా అన్న పదాన్ని తొలగించాలంటూ నోటీసులు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా విషయంలో ఇప్పటి వరకు సరైన అప్​డేట్​ రాలేదు.మరోవైపు తేజు కోసం కిషోర్‌ తిరుమల 'చిత్రలహరి 2' స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు నెట్టింట టాక్​ నడుస్తోంది.

ఇక యంగ్ హీరో అక్కినేని అఖిల్‌ మూవీస్ విషయంలోనూ ఇదే సస్పెన్స్‌ కొనసాగుతోంది. గతేడాది విడుదైన 'ఏజెంట్‌' సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో ప్రస్తుతం అఖిల్ కథల ఎంపికలో కాస్త జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే 'ఏజెంట్​' వచ్చి ఏడాది పూర్తి కావొస్తున్నా కూడా ఇంకా తన అప్​కమింగ్ మూవీస్ విషయంలో క్లారిటీ రావట్లేదు. అయితే యూవీ క్రియేషన్స్‌లో అనిల్‌ కుమార్‌ అనే కొత్త డైరెక్టర్​తో అఖిల్ ఓ సినిమా చేయనున్నట్లు సమచారం.

మెగా వారసుడైన వైష్ణవ్​ తేజ్​ కూడా తన అప్​కమింగ్ మూవీస్​ విషయంలో సైలెంట్​గానే ఉన్నారు. 'ఉప్పెన' సినిమాతో అభిమానులను ఆకట్టుకున్న ఈ స్టార్ హీరో, ఆ తర్వాత 'కొండపొలం' చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. అయితే ఇటీవలే వచ్చిన 'రంగ రంగ వైభవంగా', 'ఆదికేశవ' సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద నిరుత్సాహపరిచాయి. దీంతో వైష్ణవ్​ కూడా తన అప్​కమింగ్ మూవీస్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకం విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇంత వరకు వైష్ణవ్‌ నుంచి మరో కొత్త కబురు వినపడలేదు.

ఇటీవలే 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' సినిమాతో మసివ్ బ్లాక్​బస్టర్ అందుకున్నారు స్టార్ హీరో నవీన్‌ పొలిశెట్టి. దీని తర్వాత ఆయన 'అనగనగా రాజు' అనే ఓ సినిమాలో లీడ్ రోల్​ చేస్తున్నట్లు గతంలో ఓ గ్లింప్స్​ వీడియో కూడా విడుదలైంది. కానీ, ఆ తర్వాత దానికి సంబంధించి మరే విశేషాలు బయటకు రాలేదు. అయితే నవీన్‌ తాజాగా సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. తన సినిమాలన్నీ ప్రస్తుతం స్క్రిప్టింగ్​ పనుల్లో ఉన్నాయని, మంచి కొత్తదనం నిండిన చిత్రాలను అందించడానికి ఇంకాస్త సమయం పడుతుందని అంత వరకు కాస్త ఓపికగా ఎదురు చూడాలంటూ ఆడియెన్స్​ను కోరారు.

'విరాట పర్వం' తర్వాత కెమియో రోల్​లో కనిపించిన రానా ఇటీవలే తేజ రూపొందిస్తున్న 'రాక్షస రాజు' సినిమాలో కనిపించనున్నారు. ఇటీవలే రానా బర్త్​డే సందర్భంగా మూవీ టీమ్​ ఓ సాలిడ్​ పోస్టర్​ను రిలీజ్ చేసింది. అయితే ఈ చిత్రం ఇంత వరకు పట్టాలెక్కలేదు. మరోవైపు ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్​ హిరణ్య కశ్యప గురింతి గతేడాది కామికాన్‌ వేడుకలో ప్రకటించినప్పటికీ దీనికి సంబంధించిన అప్​డేట్స్​ కూడా రాలేదు. అయితే రానా ప్రస్తుతం రజనీకాంత్‌ 'వేట్టయాన్‌'లో కీ రోల్​ ప్లే చేస్తున్నారు.

సినిమాలపై క్రేజ్- గవర్నమెంట్ జాబ్స్ వదులుకున్న స్టార్స్ వీరే!

90's ​లోనే భారీ రెమ్యునరేషన్- రూ.కోటి అందుకున్న తొలి స్టార్ ఎవరంటే ? ​

Last Updated : Feb 24, 2024, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details