Tollywood Deepavali 2025 : పండుగ జోష్ పెంచాలంటే సినిమాలే. కథతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ అన్నీ కుదిరితే ఏ పండగకైనా కాసుల వర్షం కురిసి తీరాలంతే. అందుకే ఏ నిర్మాతైనా పండగ ముందో లేదా పండుగ రోజే తమ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంటారు. అలా ప్లాన్ చేసిందే వేట్టాయన్, విశ్వం, మా నాన్న సూపర్ హీరో, జనక అయితే గనక లాంటి. ఈ సినిమాలన్నీ కలెక్షన్స్‌తో పాటు కూడా కంటెంట్ పరంగా మిక్స్డ్ రివ్యూస్ రావడంతో నిరాశ తప్పలేదు. ఫలితంగా దసరాకు బాక్సాఫీసు దగ్గర ఓ మోస్తారు వసూళ్లే నమోదు అయ్యాయి. కాగా, దసరాకు ముందు వచ్చిన దేవర, ది గోట్ చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి.
ఇక దసరా పండుగ తూతూ మంత్రంగా దాటిపోవడంతో, సినీ పరిశ్రమ కళ్లన్నీ రాబోయే దీపావళి మీదే ఉన్నాయి. ఎక్కువ సెలవు రోజులు లేకపోయినా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమాలతో రెడీ అవుతున్నారు నిర్మాతలు. విశ్వక్సేన్ సినిమా మెకానిక్ రాకీ దసరా రేసు నుంచి తప్పుకున్నప్పటికీ నాలుగు సినిమాలు పోటీలోకి దిగుతున్నాయి.
వీటితో దుల్కర్ సల్మాన్ మూవీ 'లక్కీ భాస్కర్'పై మంచి అంచనాలు ఉన్నాయి. మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్‌గా నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతుంది.
దీంతో పాటు సాయి పల్లవి హీరోయిన్‌గా తమిళ అనువాదం సినిమా 'అమరన్' కూడా దీపావళి బరిలో నిలవనుంది. రాజ్ కుమార్ పెరియసామి దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఆగష్టులోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, పలు కారణాలతో వాయిదా పడుతూ దీపావళికి రానుంది.
కన్నడలో రోరింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీమురళి ప్రధాన పాత్రలో నటించించిన తాజా చిత్రం బఘీరా(Prasanth Neel Bhageera) కూడా దీపావళికే రానుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహించారు. కేజీఎఫ్, కాంతార, సలార్ లాంటి సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ దీనిని నిర్మించింది.