Tollywood Box Office Dasara 2024 : చిత్ర పరిశ్రమలో సంక్రాంతి, సమ్మర్ తర్వాత పెద్ద బాక్సాఫీస్ సీజన్ దసరా. ఈ పండగకు వీలైనన్ని చిత్రాల్ని విడుదల చేసి, సినీప్రియుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు ఆయా దర్శకనిర్మాతలు, హీరోలు. ఈ సారి ఏకంగా ఐదు చిత్రాలు బాక్సాఫీస్ ముందు పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో ఓ తమిళ సినిమా కూడా ఉంది. ఇంతకీ ఆ చిత్రాలేంటి? వాటి వివరాలను తెలుసుకుందాం.
Sri Vishnu Swag Movie : యంగ్ హీరో శ్రీ విష్ణు 'శ్వాగ్' చిత్రంతో అక్టోబరు 4న థియేటర్లలోకి వస్తున్నారు. 'సామజవరగమన', 'ఓం భీం బుష్' సక్సెస్ తర్వాత విష్ణు నుంచి రానున్న కొత్త చిత్రమిది. హసిత్ గోలి దర్శకుడు. రాజ రాజ చోర సక్సెస్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. తరతరాలుగా సాగుతున్న ఆడ, మగల ఆధిపత్య పోరును ఇతివృత్తంగా, కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించారు. శ్రీవిష్ణు ఇందులో నాలుగు భిన్నమైన పాత్రలు పోషించారు. సింగ, భవభూతి, యయాతి, కింగ్ భవభూతిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. చూడాలి మరి 'శ్వాగ్'తో విష్ణు హ్యాట్రిక్ హిట్ అందుకుంటారా లేదా అనేది.
Gopichand Viswam Movie : చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్, సుధీర్‌బాబు కూడా ఈ పండగ బరిలోనే దిగుతున్నారు. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన చిత్రం 'విశ్వం'. టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు మేకర్స్. అక్టోబరు 11న థియేటర్లలోకి రానుందీ చిత్రం.
Sudheer Babu Ma Nanna Hero : అక్టోబర్ 11నే మా నాన్న సూపర్ హీరో చిత్రంతో రానున్నారు సుధీర్ బాబు. అభిలాష్ రెడ్డి కంకర తెరకెక్కించారు. తండ్రీకొడుకుల అనుబంధంతో తెరకెక్కిందీ చిత్రం. మరి ఈ చిత్రంతోనైనా సుధీర్ హిట్ ట్రాక్ ఎక్కుతారా, లేదా? చూడాలి.