Anupama Parameswaran:'ప్రేమమ్' సినిమాతో సిల్వర్ స్క్రీన్‌కు ఎంట్రీ ఇచ్చిన మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, 'అఆ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కెరీర్ ప్రారంభం నుంచి సంప్రదాయ పాత్రల్లో కనిపించి పక్కింటి అమ్మాయి ఇమేజ్ గుర్తింపు తెచ్చుకుందీ ఆమ్మడు. అలాంటిది రీసెంట్గా 'టిల్లు స్క్వేర్'తో ఉన్నట్టుండి గ్లామరస్ క్యారెక్టర్‌తో అభిమానులకు షాకిచ్చింది. లిప్ లాక్ సీన్లతో ఒక్కసారిగా హాట్‌నెస్ గేట్లు ఎత్తేసింది. ఒక్కసారిగా ఇలాంటి గ్లామరస్ రోల్‌తో 'టిల్లు స్క్వేర్'లో ఎంట్రీ ఇచ్చిన అనుపమను చూసి సౌత్ అభిమానులంతా షాక్ అయ్యారు. అయితే బోల్డ్ పెర్ఫార్మెన్స్‌తో కొత్తగా కనిపించిన అనుపమను ఈ పాత్ర డైలమాలో పడేసింది. 'టిల్లు స్క్వేర్'తో సడెన్‌గా మారిన ఇమేజ్ ఎటూ తేల్చుకోలేకుండా చేసింది.
ఇప్పుడు ఆమెకు వచ్చిన ప్రతి సినిమాలో బోల్డ్ క్యారెక్టర్లే ఆఫర్లుగా వస్తున్నాయట. ఒకే తరహా పాత్రలకు ఫిక్స్ అయ్యి ఉండటం ఇష్టం లేకనే బోల్డ్ పాత్రలు ఒప్పుకున్న అనుపమ, బ్యాక్ టు బ్యాక్ అవే రోల్స్‌లో కనిపించేందుకు సిద్ధంగా లేదట. ఒకవేళ ఆమె గ్లామరస్ పాత్రలకు ఓకే అంటే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు క్యూ కట్టారట. ఇప్పటికే కొన్నింటికీ నో చెప్పేసిన అను మిగిలిన వాటికి ఏం చెప్పాలో అర్థం కాక సందేహంలో పడిందట.
'టిల్లు స్క్వేర్' సినిమాలో కథ డిమాండ్‌కు తగ్గట్టుగా అనుపమకు బోల్డ్‌నెస్ పాత్రలో కనిపించక తప్పలేదు. ఏదో పారితోషికం వస్తుంది కదా అని మరోసారి ఆ పాత్రలకు ఆమె సిద్ధం కావడానికి సిద్ధంగా లేదట. మళ్లీ సంప్రదాయ, ఫ్యామిలీ రోల్స్‌లో నటించి స్టోరీ డిమాండ్ మేరకు బోల్డ్‌గా కనిపించాలనుకుంటుందట. ఏదేమైనా, 'టిల్లు స్క్వేర్' అనుపమను డైలమాలో పడేసిందనడం వాస్తవం. ఆమె నెక్స్ట్ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో చూడాలి మరి.