ETV Bharat / entertainment

'పుష్ప 3' కన్ఫామ్​​ - మూవీలో విజయ్ దేవరకొండ కూడా! - టైటిల్ ఏంటంటే?

'పుష్ప 3'కు సంబంధించి బయటకొచ్చిన ఆసక్తికరమైన అప్డేట్ - ఏంటంటే?

Allu Arjun Pushpa 3 The Rampage
Allu Arjun Pushpa 3 The Rampage (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 18 hours ago

Allu Arjun Pushpa 3 The Rampage : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప 2' మరో రెండు రోజుల్లో బాక్సాఫీస్ ముందుకు రానుంది. డిసెంబర్ 5న థియేటర్లలో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. దర్శకుడు సుకుమార్​ పాన్ ఇండియా రేంజ్​లో భారీ బడ్జెట్​తో దీన్ని తెరకెక్కించారు.

అయితే ఈ చిత్రానికి కొనసాగింపుగా 'పుష్ప 3' ఉంటుందని ఎప్పటి నుంచో టాక్‌ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ తాజాగా ఓ ఫొటో అఫీషియల్​గా బయటకు వచ్చింది. 'పుష్ప 2'కు సౌండ్‌ ఇంజినీర్‌గా ఆస్కార్‌ అవార్డు విజేత, రసూల్‌ పూకుట్టి పని చేశారు. అయితే తాజాగా ఆయన తన టీమ్‌తో కలిసి దిగిన ఫొటో వెనక 'పుష్ప 3' అనే టైటిల్‌ రాసి ఉంది. పుష్ప 3 : ది ర్యాంపేజ్‌ (Pushpa3: The Rampage) అని ఉంది. దీంతో ఇప్పుడు పార్ట్‌ - 2 చివరిలో మూడో భాగానికి సంబంధించి హింట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

పైగా కొద్ది రోజుల కిందట కూడా బెర్లిన్‌ ఫిల్మ్ ఫెస్టివల్​లో అల్లు అర్జున్‌ కూడా పుష్ప 3 ఉంటుందని తెలిపారు. దీంతో ఇప్పుడు పుష్ప 2 క్లైమాక్స్‌లో మూడో భాగానికి లీడ్‌ ఇస్తూ కొన్ని సీన్స్​ను చూపించనున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు, మూడేళ్ల తర్వాతే మూడో భాగానికి అవకాశం ఉంటుందని టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఓ వైపు సుకుమార్‌, మరోవైపు అల్లు అర్జున్‌ ఇతర వేరే కమిట్‌మెంట్స్​తో బిజీగా ఉండనున్నారు. అవి పూర్తి అవ్వడానికి కచ్చితంగా మరో రెండేళ్లు పడుతుంది. అంటే ఈ లెక్కన అప్పుడు మూడో భాగానికి సంబంధించిన పనులు ప్రారంభం అవ్వొచ్చు.

ఇంకా ఆ మధ్య 2022లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా దర్శకుడు సుకుమార్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పుష్ప 3గురించి అప్డేట్ ఇచ్చారు. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్, పుష్ప ది ర్యాంపేజ్ అని రాసుకొచ్చారు. ఇప్పుడా ట్వీట్ కూడా మళ్లీ వెరల్​ అవుతోంది. మరో విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండ కూడా ఈ పుష్ప 3లో ఓ పాత్రలో కనిపించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మరో విషయం ఏమిటంటే దర్శకుడు సుకుమార్​తో విజయ్ దేవరకొండ కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. ఏదైమైనా ప్రస్తుతం పుష్ప 3 ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

బుక్‌ మై షోలో 'పుష్ప 2' హవా - సౌత్​లో మరో నయా రికార్డు సొంతం!

'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్​లో అల్లు అర్జున్ ఎమోషనల్ స్పీచ్ - ఫ్యాన్స్​ను ఉద్దేశించి బన్నీ ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.