తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రామ్​చరణ్​తో పోటీకి దిగనున్న నాగచైతన్య! - GAMECHANGER VS THANDEL

మెగా హీరో రామ్​చరణ్​తో పోటీకి దిగేందుకు అక్కినేని నాగచైతన్య సిద్ధమేనా?

Ramcharan GameChanger VS Naga Chaitanya Thandel
Ramcharan GameChanger VS Naga Chaitanya Thandel (Source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2024, 4:16 PM IST

Ramcharan GameChanger VS Naga Chaitanya Thandel : టాలీవుడ్​లో​ రామ్​ చరణ్​, నాగ చైతన్య - ఈ ఇద్దరు హీరోలకు, వారి ఫ్యామిలీ బ్యాక్​గ్రౌండ్​కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక రంగస్థలం, ఆర్​ఆర్​ఆర్​ వంటి చిత్రాలతో రామ్​చరణ్​ తన క్రేజ్​, మార్కెట్​ను మరింత పెంచుకున్నారు. ఇక చైతూ కూడా భారీ హిట్ అందుకుని తన మార్కెట్​ పరిధిని పెంచుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ప్రస్తుతం చందూ మొండేటితో కలిసి తండేల్‌ అనే ప్రాజెక్ట్ చేస్తున్నారు. NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రంపై ఆడియెన్స్​లో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు చాలా రోజుల క్రితమే ప్రకటించగా, తాజాగా ఇప్పుడీ చిత్రం వాయిదా పడే అవకాశాలున్నాయంటూ మరో వార్త తెరపైకి వచ్చింది. తండేల్‌ను సంక్రాంతి (Thandel Sankranthi) బరిలో దింపాలని మేకర్స్​ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

GameChanger Sankranthi Release :మరోవైపు ఇప్పటికే చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న రామ్​ చరణ్‌ గేమ్​ఛేంజర్​ ఎట్టకేలకు సంక్రాంతికి బెర్త్​ను కన్ఫామ్ చేసుకుంది. విశ్వంభర టీమ్​ను రిక్వెస్ట్​ చేసుకుని మరీ ఈ పండగ బరిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తండేల్​ సంక్రాంతి బెర్త్​ కన్ఫామ్​ నిజమైతే బాక్సాఫీస్‌ దగ్గర గేమ్‌ ఛేంజర్‌తో పోటీ పడటం ఖాయమైపోయినట్టే! చూడాలి మరి తండేల్‌ రిలీజ్‌పై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో.

కాగా, తండేల్‌లో సాయిపల్లవి శ్రీకాకుళం అమ్మాయి సత్య పాత్రలో కనిపించనుంది. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్‌ అందిస్తున్నారు.

పైగా, నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా ఇది. మేకర్స్‌ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌లో చైతూ మత్య్సకారుడిగా మాస్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు.

కమెడియన్ దర్శకత్వంలో హీరో సూర్య కొత్త సినిమా - అఫీషియల్ అనౌన్స్​మెంట్​

8 నెలల క్రితం చనిపోయిన అమ్మాయితో హీరో ప్రేమ! - ఈ వారం థియేటర్/OTT సినిమాలివే

ABOUT THE AUTHOR

...view details