తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆ అనుభూతిని బాలీవుడ్‌లో ఎప్పుడూ పొందలేదు' - సలార్ మూవీ తాత

Tinnu Anand Salaar Movie : సలార్ మూవీలో ఎంతో మంది స్టార్స్​ మెరిసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా టీజర్​లో ప్రభాస్​కు ఎలివేషన్​ ఇచ్చిన టీనూ ఆనంద్​ను అయితే ఎవ్వరూ మరిచిపోలేరు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'సలార్' సెట్స్​లో తన అనుభవాలను పంచుకున్నారు.

Tinnu Anand Salaar Movie
Tinnu Anand Salaar Movie

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 7:27 AM IST

Tinnu Anand Salaar Movie :రెబల్​ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'సలార్'. పాన్ ఇండియా లెవెల్​లో రూపొందిన ఈ చిత్రం ఇటు ఇండియాతో పాటు అటు ఓవర్సీస్​లోనూ సంచలనాలు సృష్టించింది. ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​లోనూ స్ట్రీమింగ్​కు వచ్చి అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్‌ నటుడు టీనూ ఆనంద్‌ ఓ ఇంటర్వ్యూలో సలార్ సినిమా గురంచి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా హీరో ప్రభాస్​పై ప్రశంసల జల్లును కురిపించారు.

" ఒక రోజు నేను, ప్రభాస్‌, పృథ్వీరాజ్‌, ఆయన సతీమణి, డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్​తో కలిసి 'సలార్‌' సెట్స్‌లో ల్యాప్‌టాప్‌లో టీజర్‌ చూశాం. అందులో తన పాత్రకు నేను ఇచ్చిన ఎలివేషన్‌కు ప్రభాస్‌ ఫిదా అయ్యారు. వెంటనే నా దగ్గరకు వచ్చి ఆయన హగ్‌ చేసుకున్నారు. టీజర్‌ మొత్తంలో ఒకే ఒక షాట్‌ తనది. అయినప్పటికీ 'టీనూ సర్‌ అదిరిపోయింది' అంటూ నన్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇలా మనం చేసిన పనిని ఎవరైనా నలుగురిలో ప్రశంసిస్తే మనకు కాన్ఫిడెన్స్​ పెరుగుతుంది. మరి, స్టార్‌ హీరో ప్రభాస్‌ పొగిడితే ఎలా ఉంటుంది? మరోవైపు, టీజర్‌ చూసిన వెంటనే 'ప్రశాంత్‌ ఇప్పుడే దీన్ని రిలీజ్​ చేయండి' అంటూ పృథ్వీరాజ్‌ సతీమణి అన్నారు. అలా సెట్స్‌లో ఉన్న ఇతరులు కూడా నన్ను అభినందించారు. అప్పుడు నేను పొందిన అనుభూతిని బాలీవుడ్‌లో ఎప్పుడూ పొందలేదు" అంటూ సలార్ సెట్స్​తో తన అనుభూతులను పంచుకున్నారు.

Salaar Movie Cast : ఇక సలార్ సినిమాలో ప్రభాస్​తో పాటు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతి హాసన్‌, జగపతిబాబు, బాబీ సింహా, టినూ ఆనంద్‌, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్‌ సూపర్ బ్యాక్​గ్రౌండ్ స్కోర్​, సాంగ్స్​ మూవీ లవర్స్​ను తెగ ఆకట్టుకున్నాయి. హొంబాలే మీడియా సంస్థ తెరకెక్కించిన ఈ సినిమాకు విజయ్‌ కిరంగదూర్‌ నిర్మాతగా వ్యవహరించారు. పార్ట్​-1 సీజ్​ ఫైర్​గా విడుదలైన ఈ సినిమాకు శౌర్యంగ పర్వం అనే సీక్వెల్​ను రెడీ చేసేందుకు మేకర్స్​ సన్నాహాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details