తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

8 నెలల క్రితం చనిపోయిన అమ్మాయితో హీరో ప్రేమ! - ఈ వారం థియేటర్/OTT సినిమాలివే - THIS WEEK THEATRE OTT RELEASES

ఈ వారం థియేటర్/OTTలో రిలీజ్ కానున్న ఆసక్తికర సినిమా, సిరీస్​లివే

This Week Theatre OTT Releases
This Week Theatre OTT Releases (source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2024, 6:37 PM IST

This Week Theatre OTT Releases :గత వారం వీకెండ్​ దసరా బరిలో దిగిన చిత్రాలన్నీ దాదాపుగా నిరాశ పరిచాయి. పెద్ద సినిమాగా విడుదలైన సూపర్ స్టార్ రజనీ కాంత్ వేట్టాయన్ కూడా మిక్స్​డ్​ రివ్యూస్ అందుకున్నాయి. ఇక ఈ వారం కూడా అన్నీ చిన్న చిత్రాలే బాక్సాఫీస్ ముందు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అలానే ఓటీటీలోనూ పలు చిత్రాలు, సిరీస్​లు స్ట్రీమింగ్​కు సిద్ధమయ్యాయి. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం.

థియేటర్ రిలీజ్ సినిమాలు

వాస్తవ సంఘటనల ఆధారంగా - మైత్రీ మూవీ మేకర్స్‌ విడుదల చేస్తున్న లవ్‌రెడ్డి అక్టోబర్ 18న థియేటర్లలోకి రానుంది. అంజన్​ రామచంద్ర, శ్రావణిరెడ్డి కీలక పాత్రల్లో నటించారు. స్మరన్‌రెడ్డి దర్శకత్వం వహించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కించారు.

మత్స్యకారుల జీవితాలు ప్రతిబింబించేలా - సముద్రుడు అనే చిత్రం అక్టోబరు 18నే థియేటర్లలోకి రానుంది. రమాకాంత్‌, అవంతిక, భానుశ్రీ కలిసి నటించారు. నగేశ్‌ నారదాసి దర్శకత్వంలో రూపొందింది. మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబించేలా తీశారు.

మిస్టరీ థ్రిల్లర్‌తో - కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి రూపొందించిన చిత్రం వీక్షణం. రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇది కూడా అక్టోబరు 18నే థియేటర్‌లో రానుంది. 8 నెలల క్రితం చనిపోయిన అమ్మాయితో హీరో ప్రేమలో పడిన తర్వాత ఏం జరిగిందన్నదే ఈ చిత్ర కథ.

టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో -సాయి రోనక్‌ హీరోగా రానున్న కొత్త చిత్రం రివైండ్‌. కళ్యాణ్‌ చక్రవర్తి దర్శకత్వం వహించారు. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్​తో రూపొందింది. అమృత చౌదరి హీరోయిన్. ఓ యువకుడు తన ప్రేమను గెలిపించుకోవడానికి టైమ్‌ మెషీన్‌లో ప్రయాణించి ఏం చేశాడన్నదే కథ.

ఖడ్గం రీరిలీజ్​ - శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రల్లో వచ్చిన సూపర్ హిట్ ఖడ్గం రీరిలీజ్​కు సిద్ధమైంది. కృష్ణవంశీ దర్శకుడు. అక్టోబరు 18నే ఇది కూడా రీరిలీజ్ కానుంది.

ఈ వారం ఓటీటీ చిత్రాలు/సిరీస్‌లివే!

ఈటీవీ విన్‌ ఓటీటీలో

కలి (తెలుగు) అక్టోబరు 17

డిస్నీ+హాట్‌స్టార్‌ ఓటీటీలో

రీతా సన్యాల్‌ (హిందీ) - అక్టోబరు 14

నెమిసిస్‌ (డచ్‌) - అక్టోబరు 16

రైవల్స్‌ (ఇంగ్లీష్‌) - అక్టోబరు 18

1000 బేబీస్‌ (మలయాళం) - అక్టోబరు 18

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో

ది ప్రదీప్స్‌ ఆఫ్‌ పిట్స్‌బర్గ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 17

నెట్‌ఫ్లిక్స్​ ఓటీటీలో

ది లింకన్‌ లాయర్‌ (ఇంగ్లీష్‌) - అక్టోబరు 17

ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో (టాక్‌ షో) - అక్టోబరు 19

ఫ్యాబులస్‌ లైవ్‌స్‌ వర్సెస్‌ బాలీవుడ్‌ వైవ్స్‌: సీజన్‌3 (హిందీ) - అక్టోబరు 18

'70 ఏళ్లలో ఎప్పుడూ అలా జరగలేదు' - పుష్ప 2 అప్డేట్​ ఇచ్చిన నిర్మాత

ఒకే ఫ్రేమ్​లో రజనీ, సూర్య, ప్రభాస్ - ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details