స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒకేసారి మూడు బడా హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ వారం మళ్లీ చిన్న చిత్రాలు అలరించడానికి సిద్ధమయ్యాయి. అలానే ఓటీటీలోనూ పలు సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి. వీటిలో కల్కి, రాయన్, డిమాంటి కాలనీ 2 ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.
చిరంజీవి పుట్టిన రోజు ప్రత్యేకంగా - ప్రస్తుతం టాలీవుడ్ రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు మళ్లీ విడుదల కానున్నాయి. బి.గోపాల్ తెరకెక్కించిన ఇంద్రతో(Indra Movie Rerelease) పాటు, జయంత్ సి.పరాన్జీ తెరకెక్కించిన శంకర్‌దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్ కానున్నాయి.
మధ్య తరగతి నిరుద్యోగి కథ - రావు రమేశ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం (Maruti Nagar Subramanyam). లక్ష్మణ్ కార్య దర్శకుడు. పీబీఆర్ సినిమాస్ నిర్మించింది. ఇంద్రజ, రమ్య పసుపులేటి, అంకిత్ కొయ్య ఇతర పాత్రల్లో నటించారు. ఆగస్టు 23న సినిమా రిలీజ్ కానుంది. నడి వయసులో ఉన్న ఓ మధ్యతరగతి నిరుద్యోగి కథ ఇది అని మూవీటీమ్ చెబుతోంది.
ఆ ఇంటి చుట్టూ ఏం జరుగుతోంది - అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ నటించిన డిమాంటి కాలనీ 2(demonte colony 2) ఈనెల 23న రానుంది. అజయ్ ఆర్.జ్ఞానముత్తు దర్శకుడు. విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్.సి.రాజ్‌కుమార్ నిర్మాతలు.
ఇంకా ప్రదీప్ రెడ్డి, గోవా జ్యోతి నటించిన యజ్ఞ, అర్జున్ అంబటి, చాందిని తమిళరసన్ నటించిన వెడ్డింగ్ డైరీస్ విడుదల కానున్నాయి.
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమా/సిరీస్‌లివే
అమెజాన్ ప్రైమ్
యాంగ్రీ యంగ్‌మెన్: ది సలీమ్- జావెద్ స్టోరీ (హిందీ సిరీస్) ఆగస్టు 20
కల్కి 2898 ఏడీ (తెలుగు) ఆగస్టు 23
రాయన్ (తెలుగు) ఆగస్టు 23
ఫాలో కర్‌లో యార్ (రియాల్టీ షో) ఆగస్టు 23
నెట్‌ఫ్లిక్స్‌లో
ఇన్‌కమింగ్ (హాలీవుడ్) ఆగస్టు 23