తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఈ వారం 15 క్రేజీ సినిమా/సిరీస్​లు - మీ ఛాయిస్ ఏంటి? - This Week OTT Releases - THIS WEEK OTT RELEASES

This Week OTT Releases : గత కొన్ని వారాలుగా చిన్న చిత్రాలే బాక్సాఫీస్‌ ముందుకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మే చివరి వారం వచ్చేసింది. కానీ ఈ వారం వచ్చేది చిన్న చిత్రాలే అయినా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అలానే ఓటీటీలోనూ పలు కొత్త సిరీస్ సినిమాలు స్ట్రీమింగ్​కు రెడీ అయ్యాయి. అవేంటంటే?

Source Getty Images
Theatre OTT movies (Source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 4:23 PM IST

This Week OTT Releases : గత కొన్ని వారాలుగా చిన్న చిత్రాలే బాక్సాఫీస్‌ ముందుకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మే చివరి వారం వచ్చేసింది. కానీ ఈ వారం వచ్చేది చిన్న చిత్రాలే అయినా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అలానే ఓటీటీలోనూ పలు కొత్త సిరీస్ సినిమాలు స్ట్రీమింగ్​కు రెడీ అయ్యాయి. అవేంటంటే?

  • విశ్వక్​​ సేన్‌ నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకుడు. నేహాశెట్టి కథానాయిక. అంజలి కీలక పాత్ర పోషించింది. అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు మే 31న ఈ చిత్రం రిలీజ్​కు రెడీ అయింది. ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.
  • బేబీతో భారీ విజయాన్ని అందుకున్న ఆనంద్‌ దేవరకొండ ఇప్పుడు గం గం గణేశాగా రాబోతున్నాడు. ఉదయ్‌ శెట్టి దర్శకుడు. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్​గా నటించింది. ఈ చిత్రం మూవీ మే 31కే సిద్ధమైంది.
  • స్టార్ హీరోయిన్​గా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న జాన్వీ కపూర్‌ విలక్షణ హీరో రాజ్‌కుమార్‌తో కలిసి చేసిన రొమాంటిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి. సినిమాలో జాన్వీ క్రికెటర్‌గా కనిపించనుంది. మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • కార్తికేయ కథానాయకుడిగా నటించిన మరో కొత్త చిత్రం భజే వాయు వేగం. ప్రశాంత్‌రెడ్డి చంద్రపు దర్శకుడు. ఐశ్వర్య మేనన్‌ హీరోయిన్. ఒక సామాన్య వ్యక్తి అసాధరణ సమస్యలో ఇరుక్కుంటే చివరకి ఎలా బయటపడ్డాడు అనేదే కథ. ఇది కూడా మే 31నే రానుంది.
  • విలక్షణ నటుడు శరత్​ కుమార్​ నటించిన హిట్‌ లిస్ట్‌ మే 31నే రిలీజ్ కానుంది.

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లు

అమెజాన్‌ ప్రైమ్​లో

పంచాయత్‌ 3 (వెబ్‌సిరీస్‌) మే 28

నెట్‌ఫ్లిక్స్​లో

గీక్‌ గర్ల్‌ (వెబ్‌సిరీస్‌) మే 30

ఎరిక్‌ (వెబ్‌సిరీస్‌) మే 30

జీ5లో

స్వతంత్ర్య వీర్‌ సావర్కర్‌(హిందీ) మే 28

జియోలో

ఇల్లీగల్‌ 3 (హిందీ సిరీస్‌) మే 29

ది లాస్ట్‌ రైఫిల్‌ మ్యాన్‌ (హాలీవుడ్‌) మే 31

దేడ్‌ బీఘా జమీన్‌(హిందీ) మే 31

డిస్నీ+హాట్‌స్టార్‌లో

కామ్‌డెన్‌ (వెబ్‌సిరీస్‌) మే 28

ఉప్పు పులి కారమ్‌ (తమిళ) మే 30

ది ఫస్ట్‌ ఆమెన్‌ (హాలీవుడ్) మే 30

బాప్​రే, రూ.105 కోట్ల డ్రెస్​తో బాలయ్య బ్యూటీ హంగామా! - ఫోటోస్ చూశారా? - Cannes film festival 2024

'నన్ను ఆ దుస్తుల్లో చూడటం ఇష్టం లేదు- అలా ఫొటోలు తీయకండి'- జాన్వీ సీరియస్ - Janhvi Kapoor Photos

ABOUT THE AUTHOR

...view details