This Week OTT Releases : థియేటర్‌లో ఇంకా ప్రభాస్ కల్కి 2898 ఏడీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. విడుదలై రెండు వారాలు దాటినా ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ వారం కల్కితో పాటు థియేటర్లలో మళ్లీ చిన్న చిత్రాలే కనిపిస్తున్నాయి. ఎలాగో వీకెండ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఓటీటీలోనూ అలరించేందుకు తెలుగుతో పాటు, ఇతర భాషల డబ్లింగ్ సినిమాలు, సిరీస్‌లు రెడీ అయ్యాయి. మరి ఈ వీకెండ్ థియేటర్ ప్లాన్ లేనివాళ్ల కోసం ఓటీటీ సినిమా వివరాలను తీసుకొచ్చాం. ఇంతకీ ఏ ఓటీటీ వేదికగా ఏఏ చిత్రాలు, సిరీస్‌లు అలరించనున్నాయో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్‌లో -మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడు జీవితం(ది గోట్ లైఫ్) రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జులై 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో ఇంకా
- త్రిభువన్ మిశ్రా సీఏ టాప్‌ర్ (హిందీ-సిరీస్) జులై 18
- స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ - (ఇంగ్లిష్) జులై 19
- ఫైండ్ మీ ఫాలింగ్ (ఇంగ్లిష్) జులై 19
జీ5లో - అంజలి కీలక పాత్రలో నటించిన రివేంజ్ థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్ బహిష్కరణ జులై 19వ తేదీ నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్ కానుంది. జీ5లో ఇంకా బర్జాఖ్ (హిందీ సిరీస్) జులై 19 స్ట్రీమింగ్ అవ్వనుంది.
ఈటీవీ విన్, ఆహాలో - సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ హరోం హర ఈటీవీ విన్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే చిత్రమిది. మాళవికా శర్మ హీరోయిన్. జ్ఞానసాగర ద్వారక దర్శకుడు. ఈటీవీ విన్లో ఇంకా మ్యూజిక్ షాపు మూర్తి (తెలుగు) స్ట్రీమింగ్ అవుతోంది.