ETV Bharat / state

తీరానికి సమీపంలోనే అల్పపీడనం - గురువారం వరకు వర్షసూచన - THE SKY IS CLOUDY IN VIZAG

అల్పపీడనం తీరం వద్దే ఉండటం వల్ల ఆకాశం మేఘావృతం - 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం - వెల్లడించిన విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం

THE SKY IS CLOUDY IN VIZAG
తీరానికి సమీపంలోనే అల్పపీడనం (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Heavy Rains in Andhra Pradesh : పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంతమేర బలహీనపడి సముద్ర తీరానికి సమీపంలోనే ఉందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీరం వద్దే అల్పపీడనం ఉండటం వల్ల ఆకాశం పూర్తిగా మేఘాలతో కమ్ముకుని ఉన్నట్లు తెలిపింది. రాబోయే మరో రెండు రోజులపాటు వాతావరణం ఇదే తరహాలో కొనసాగుతుందని తెలిపింది. గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశమున్నట్లు పేర్కొంది.

వైజాగ్​ పోర్టులో మూడో నెంబర్‌ సాధారణ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గురువారం (డిసెంబరు 26) వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో సోమవారం(23) నుంచి గురువారం(26) వరకు ఆంధ్రప్రదేశ్​లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముననట్లు పేర్కొంది.

పశ్చిమ గాలుల ప్రభావంతో : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల (డిసెంబరు) 16న అల్పపీడనం ఏర్పడింది. తర్వాత వాయుగుండంగా బలపడింది. తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని నిపుణులందరూ భావించారు. కానీ తర్వాత రెండు రోజులకు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఆంధ్రప్రదేశ్​ తీరం వైపు దూసుకొచ్చింది. మరో రెండు రోజుల అనంతరం వాయుగుండంగా మారింది. శనివారం (డిసెంబరు 21న) తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది.

దాదాపు వారం రోజులుగా అల్పపీడనం ఇలా వెనుకకు ముందుకు సాగుతూ ప్రయాణం సాగిస్తోంది. ఉత్తర భారతదేశం నుంచి వీచే పశ్చిమ గాలుల ప్రభావంతో వాయుగుండం ఉత్తర కోస్తా (ఏపీ) తీరం వెంబడి ప్రయాణించిందని నిపుణులు అంచనాలకు వస్తున్నారు. ప్రస్తుతం వాటి ప్రభావం తగ్గడంతో మళ్లీ అల్పపీడనం దిశ మార్చుకుందని అంటున్నారు. దీని ప్రభావంతో దాదాపు అయిదు రోజులుగా చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల పడవలు ఒడ్డుకే పరిమితమయ్యాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం - రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

బీ అలర్ట్​ - ఉత్తరాంధ్రలో మళ్లీ 'భీకర వానలు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.