Prashanth Neel About Salaar Part 1 : తాను డైరెక్ట్ చేసిన 'సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్' మూవీ రిజల్ట్ విషయంలో అంత సంతోషంగా లేనని కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. ఆయన రూపొందించిన ఈ యాక్షన్ మూవీ విడుదలై ఆదివారంతో ఏడాది పూర్తయింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఏకంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్ 'సలార్' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"ఉగ్రం'ను నేను సరిగ్గా చెప్పలేకపోయాననే ఉద్దేశంతోనే ఆ స్టోరీని మళ్లీ చెప్పాలనుకున్నట్లు గతంలో చెప్పారు. మరి 'సలార్ 1' రిజల్ట్ మీకు థియేటర్‌లో ఆ స్థాయి సంతోషాన్ని ఇచ్చిందా?' అని ప్రశ్నించగా, "సలార్-1' రిజల్ట్ వల్ల నేను సంతోషంగా లేను. ఫస్ట్ పార్ట్ కోసం నేను పడిన కష్టంతో పోలిస్తే, ఇది కాస్త నాకు నిరాశగానే అనిపించింది. ఎక్కడో 'కేజీయఫ్ 2' ఛాయలు కనిపించాయి. ఇక ఎప్పుడూ అలా జరగదు. అయితే 'సలార్ 2' మాత్రం నా కెరీర్‌లో బెస్ట్ మూవీగా తప్పకుండా తీస్తాను. ప్రేక్షకులను అంచనాలను మించేలా తీర్చిదిద్దుతాను. జీవితంలో కొన్ని విషయాలపై చాలా క్లారిటీతో ఉన్నాను. నేను మరోసారి చెబుతున్నా, ఎవరూ ప్రశ్నించే వీలు లేకుండానే 'సలార్ 2' నా బెస్ట్ మూవీల్లో ఒకటిగా ఉంటుంది" అని ప్రశాంత్ నీల్ చెప్పాడు.
'సలార్ పార్ట్ 2 : శౌర్యంగ పర్వం' కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఇది రావడానికి చాలా సమయమే పట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ 31తో మూవీ చేస్తున్నారు. 2025 ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. మరో వైపు ప్రభాస్ కూడా వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. ఇటీవలే 'సలార్ 2' పనులు మొదలు పెట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్ ప్రకటించింది.
ప్రభాస్ Vs డాన్ లీ! - ఆ పోస్టర్‌తో 'స్పిరిట్' విలన్ కన్ఫార్మ్ అయినట్లేనా!
ప్రభాస్ బిగ్ డీల్ - ఆ బడా నిర్మాణ సంస్థతో మూడు ప్రాజెక్ట్‌లు ఖరారు