ETV Bharat / health

నిద్రలేమితో బాధపడుతున్నారా? - నైట్​ పడుకునే ముందు ఈ ఆహారం తింటే హాయిగా నిద్ర పడుతుందట! - FOODS FOR BETTER SLEEP

-నిద్రలేమితో ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పు -పడుకునే ముందు వీటిని తీసుకోవాలని నిపుణుల సూచన!

Foods to Promote Better Sleep
Foods to Promote Better Sleep (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2024, 3:45 PM IST

Foods to Promote Better Sleep: ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి కారణంగా చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. రాత్రి ప్రశాంతంగా నిద్రపోకపోవడం వల్ల మరుసటి రోజు అలసట, చికాకుగా ఉండడంతోపాటు.. అజీర్ణం, తలనొప్పి వంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, నైట్​ పడుకునే ముందు కొన్ని ఆహార పదార్థాలు, డ్రింక్స్​ తాగడం ద్వారా మంచి నిద్రను సొంతం చేసుకోవచ్చని అంటున్నారు. ఆ ఆహార పదార్థాలు ఏంటో మీకు తెలుసా ? ఇప్పుడు చూద్దాం.

బాదం : ఎక్కువమంది తినే డ్రైఫ్రూట్స్‌లో బాదం ఒకటి. వీటిని రోజూ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. బాదంలో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రాత్రి ప్రశాంతంగా నిద్రపోయేలా తోడ్పడతాయి. అందుకే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పడుకునే ముందు వీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

టర్కీ కోడి మాంసం : టర్కీ కోడి మాంసంలో ప్రొటీన్స్​, పోషకాలు​ అధికంగా ఉంటాయి. ఇవి కండరాలు బలంగా ఉండేలా సహాయం చేస్తాయి. అలాగే ట్రిప్టోఫాన్‌ అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది నిద్రకు ఉపక్రమించే మెలటోనిన్ హార్మోన్​ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల రాత్రి ప్రశాంతంగా ఎక్కువసేపు నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

చామంతి టీ : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చాలా రకాల హెర్బల్​ టీలు అందుబాటులో ఉన్నాయి. అయితే, నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రోజూ పడుకునే ముందు చామంతి టీ తాగడం వల్ల ప్రశాంతంగా నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చామంతి టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రను కలిగిస్తాయి. ఇదే విషయాన్ని NIH బృందం కూడా వెల్లడించింది. (రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి)

కివీ పండ్లు : కివీస్‌లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు, విటమిన్​ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నిద్రలేమితో బాధపడేవారు రోజూ వీటిని రాత్రి తినడం వల్ల హాయిగా నిద్రపోవచ్చు.

టార్ట్​ చెర్రీ జ్యూస్ (Tart cherry juice)​: ఈ జ్యూస్​లో మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. నిద్రలేమితో బాధపడేవారు పడుకునే ముందు టార్ట్​ చెర్రీ జ్యూస్ తాగడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

చేపలు : సాల్మన్, ట్యూనా, ట్రౌట్, మాకేరెల్ వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఈ ఫ్యాటీ యాసిడ్లు మన బ్రెయిన్​కు చాలా అవసరం. ఫ్యాటీయాసిడ్లు మెదడులోని రసాయనాల సమతుల్యతను కాపాడతాయి. ఇందులో ముఖ్యంగా నిద్రకు ఉపక్రమించే సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతాయి. అందుకే నిద్రలేమితో బాధపడేవారు చేపలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

వాల్​నట్స్​ : వాల్​నట్స్​లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, లినోలెయిక్ యాసిడ్‌ వంటివి ఎక్కువగా ఉంటాయి. రోజూ వాల్​నట్స్​ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్​ తగ్గిపోయి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందట. అలాగే వీటిని రాత్రి తినడం వల్ల హాయిగా నిద్రపడుతుందని నిపుణులు పేర్కొన్నారు.

పాషన్‌ఫ్లవర్ టీ (Passionflower tea): పాషన్‌ఫ్లవర్ టీ కూడా ఓ రకమైనటువంటి హెర్బల్ టీ. దీనిని నైట్​ పడుకునే ముందు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి తొందరగా నిద్రపడుతుందట. అలాగే నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని నిపుణులంటున్నారు.

మరికొన్ని ఆహార పదార్థాలు :

  • రాత్రి పడుకునే గంట ముందు అన్నం తినడం వల్ల హాయిగా నిద్రపడుతుంది.
  • నైట్​ టైమ్​లో పాలు తాగడం ద్వారా మంచి నిద్రను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చిటికెడు ఇంగువ పోషకాలు మెండుగా- బీపీ, అజీర్తి, పీరియడ్స్ పెయిన్స్​కు చెక్!

గ్యాస్ ట్రబుల్, కడుపుబ్బరం రావడానికి కారణాలేంటి? - డాక్టర్​ దగ్గరకు ఎప్పుడు వెళ్లాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.