ETV Bharat / entertainment

2024 రౌండప్- స్టార్ హీరోలకు అదిరిపోయే హిట్స్​- సక్సెస్ ట్రాక్​ కంటిన్యూ! - 2024 TOLLYWOOD HIT CINEMAS

విజయాల బాటలో స్టార్ హీరోలు 2025లో ఏం చేయనున్నారంటే?

2024 Tollywood Hit Cinemas
2024 Tollywood Hit Cinemas (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

2024 Tollywood Hit Cinemas : ఈ ఏడాది థియేటర్లలో ఎన్నో సినిమాలు సందడి చేశాయి. ఎంతో మంది తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకొచ్చారు. అందులో కొన్ని బ్లాక్​బస్టర్స్ అవ్వగా, మరికొన్ని మాత్రం ఆడియెన్స్​ను తీవ్ర నిరాశపరిచాయి. అయితే చాలా వరకూ ఈ సారి తెలుగులో ఎన్నో హిట్ సినిమాలు వచ్చి సందడి చేశాయి. మరి ఈ 2024కు విజయంతో వీడ్కోలు పలకనున్న ఆ తారలెవరు? వారి సినిమాల విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి

'రాజాసాబ్' రానున్నారుగా!
రెబల్ స్టార్ ప్రభాస్‌ లీడ్​ ఈ ఏడాది 'కల్కి 2898 AD' సినిమాతో బాక్సాఫీస్​ను ఓ ఊపు ఊపేశారు. గతేడాది 'సలార్‌: పార్ట్‌ 1 - సీజ్‌ ఫైర్‌' సాలిడ్ సక్సెస్​ అందుకున్న ఈ తార, 'కల్కి'తో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కారు. దీంతో 2025లో ఆయన నుంచి రానున్న 'రాజాసాబ్‌'పై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. హారర్‌ కామెడీ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ప్రభాస్‌ ప్రస్తుతం ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఓ చిత్రంలో చేస్తున్నారు. ఇదీ 2025లోనే తెరపైకి వచ్చే అవకాశమున్నట్లు సినీ వర్గాల మాట.

'అరవింద సమేత', 'ఆర్‌ఆర్‌ఆర్‌' సక్సెస్​తో డబుల్‌ హ్యాట్రిక్‌ అందుకున్న జూనియర్ ఎన్​టీఆర్​, అదే జోరుతో 'దేవర'ను హిట్​ బాటలోకి నడిపించారు. ఇక 2025లో ఎన్​టీఆర్ - హృతిక్‌ రోషన్‌ కాంబోలో 'వార్‌ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అటు నార్త్​తో పాటు ఇటు సౌత్​లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.

'సరైనోడు' తర్వాత సరైన్ హిట్​ లేక సతమతమైన ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్‌ ఇప్పుడు మళ్లీ వరుస విజయాలతో టాలీవుడ్​లో దూసుకెళ్తున్నారు. 'అల వైకుంఠపురములో', 'పుష్ప: ది రైజ్‌'తో కొనసాగిన ఈ సక్సెస్​ జర్నీ ఈ డిసెంబరులో వచ్చిన 'పుష్ప 2: ది రూల్‌'తో పూర్తైంది.

వీళ్లు కూదా అదే బాటలో
కథానాయకుడు నానికి గతేడాది బాగా కలిసొచ్చింది. 'దసరా', 'హాయ్‌ నాన్న' సినిమాలతో వరుస విజయాలందుకుని బాక్సాఫీస్‌ ముందు జోరు చూపించారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది 'సరిపోదా శనివారం'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్‌ అందుకున్నారు. దీంతో కొత్త ఏడాదిలో నాని నుంచి రానున్న 'హిట్‌ 3', 'ది ప్యారడైజ్‌' సినిమాలపై అంచనాలు రెట్టింపయ్యాయి.

2022లో వచ్చిన 'డీజే టిల్లు'తో యూత్​ను అలాగే కామెడీ ప్రియులను ఆకట్టుకున్నారు నటుడు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన ఈ ఏడాది మరోసారి అదే పాత్రతో 'టిల్లు స్క్వేర్‌' ద్వారా ప్రేక్షకుల్ని మరోసారి కడుపుబ్బా నవ్వించారు. ఈ క్రమంలో ఆయన అప్​కమింగ్ మూవీ 'జాక్‌', 'తెలుసు కదా'పై భారీ అంచనాలే ఉన్నాయి.

'మహానటి' సినిమాతో తెలుగు వారికి చేరువయ్యారు మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌. 2022లో 'సీతారామం'తో టాలీవుడ్​లో మరో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ఈ ఏడాది 'లక్కీ భాస్కర్‌'తో హ్యాట్రిక్​ కొట్టారు. అంతేకాకుండా 'కల్కి 2898 AD'లో నూ ఆయన గెస్ట్​ రోల్​లో మెరిసి అభిమానులను అలరించారు. ఇక దుల్కర్‌ ప్రస్తుతం తెలుగులో 'కాంత', 'ఆకాశంలో ఒక తార' లాంటి సినిమాలు చేస్తున్నారు.

గతేడాది 'సామజవరగమన'తో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఇక ఆయన ఈ ఏడాది 'ఓం భీమ్‌ బుష్‌'తో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. కానీ ఆ తర్వాత 'శ్వాగ్‌' మాత్రం ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయింది.

రీల్​ రివైండ్ 2024 - ఈ సీక్వెల్స్​ పరిస్థితేంటంటే?

రూ.100 కోట్లు ఇచ్చినా ఆ పాత్ర చేయను : దర్శకుడిపై ప్రముఖ హీరోయిన్ అసహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.