Rana Daggubati Talk Show : వెండితెర వేదిక గానే కాకుండా ఓటీటీలోనూ వినోదాన్ని పంచుతుంటారు దగ్గుబాటి రానా. టాలీవుడ్ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పటికే రానా నాయుడు సిరీస్‌తో ఓటీటీలో మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా హోస్ట్‌గా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలను అమెజాన్ ఓటీటీ సంస్థ తాజాగా అఫీషియల్‌గా ప్రకటించింది.
The Rana Daggubati Show Streaming Date : 'ది రానా దగ్గుబాటి షో' అనే పేరుతో ఈ షో ప్రసారం కానుంది. నవంబర్ 23 నుంచి ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది అమెజాన్. ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదని, అంతకు మించిన సరదా సంభాషణలతో సాగుతుందని వెల్లడించింది. ఇక ఈ విషయం బయటకు రాగానే రానా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, దగ్గుబాటి రానా వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఇదేమీ తొలి సారి కాదు. గతంలో ఆయన నెం.1యారి అనే టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ టాక్ షో మంచి ఆదరణను దక్కించుకుంది. టాలీవుడ్‌కు చెందిన చాలా మంది నటీ నటులు ఈ టాక్ షో కార్యక్రమంలో పాల్గొని, తమ సినిమా సంగతులతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సరదా విషయాలు కూడా చెప్పారు.