Thalapathy 69 Pooja Ceremony :కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజాగా 'గోట్'తో సక్సెస్ అందుకున్నారు. ఇతర భాషల్లో అంతగా టాక్ తెచ్చుకుని ఈ చిత్రం తమిళంలో మాత్రం బ్లాక్‌బస్టర్ వసూళ్లతో దూసుకెళ్లింది. అయితే ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న దళపతి తన అప్‌కమింగ్ మూవీలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారు. 'దళపతి 69' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఇందులో ప్రధాన నటీనటులతో పాటు మిగతా మూటీ టీమ్ కూడా పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన విషయం జరిగింది. అదేంటంటే ఈ ఈవెంట్‌కు హాజరైన శివ అనే నిర్మాత విజయ్‌కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. 'GOAT' అని రాసి ఉన్న ఓ గోల్డ్ రింగ్‌ను ఆయనకు బహూకరించారు. దాన్ని అందుకున్న విజయ్ ఆ రింగ్‌ను వేసుకుని ఫొటోలు దిగారు. అందులో విజయ్ న్యూ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు.