Tatva Telugu Movie ETV Win :హిమ దాసరి, ఉస్మాన్ గని, పూజా రెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'తత్వ'. సుమారు 1 గంట నిడివి గల ఈ వెబ్ ఫిల్మ్ దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్'లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈసినిమా ట్రైలర్ విడుదలై నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
"బుల్లెట్ నుంచి తప్పించుకోవచ్చు. నేరం చేసి మాత్రం తప్పించుకోలేవు" అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా సినిమా గురించి అనౌన్స్ చేశారు మేకర్స్.
ఆరిఫ్ అనే అబ్బాయి అనుకోకుండా ఓ క్రైమ్‌లో చిక్కుకుంటాడు. తాను ఎటువంటి నేరానికి పాల్పడలేదని ఎంత చెప్పిన కూడా పోలీసులు ఆ మాటను నమ్మరు. అయితే ఆరిఫ్పై నేరస్తుడి ముద్ర పడటానికి గల కారణం ఏమిటి? అసలు అతడ్ని ఏ నేరం క్రింద పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రశ్నలతో మూవీ ఆసక్తికరంగా సాగుతుందని సమాచారం.
ఆరిఫ్ జీవితాన్ని తలక్రిందులు చేసిన ఆ రాత్రి అసలు ఏం జరిగిందనే విషయాలను ఈ చిత్రంలో చూపించారు. సస్పెన్స్, థ్రిల్ ఇలా రెండు ఎగ్జైటింగ్ అంశాలతో ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. ప్రభాస్ సాహో మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన రిత్విక్ ఎలగిరి ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం కానున్నారు.
తత్వతో పాటు ఆ రెండు సినిమాలూ
ఇదిలా ఉండగా, ఈటీవీ విన్ వేదికగా త్వత్వతో పాటు 'పైలం పిలగా' అనే మూవీ కూడా విడుదల కానుంది. సాయితేజ, పావని కరణం లీడ్ రోల్స్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ ఆనంద్ గుర్రం తెరకెక్కించారు. వీటితో పాటు 'కలి' మూవీ అక్టోబర్‌లోనే ఈటీవీ విన్లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. దీంతో పాటు పాపులర్ కొరియెన్ డ్రామా 'హిడెన్ ఐడెంటిటీ' కూడా ఈ వేదికపై రిలీజయ్యేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 31న ఈ చిత్రం ఓటీటీలో విడదల కానుంది. ఇప్పటికే రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'భలే ఉన్నాడే' మూవీ ఈటీవీ విన్లో సందడి చేస్తోంది.
ఓటీటీలోనూ కలెక్షన్స్ లెక్కలు - కొత్త ట్రెండ్ షురూ చేసిన ఈటీవీ విన్ - Committee Kurrollu OTT Collections
'వీరాంజనేయులు విహారయాత్ర'- ETV Winలో మరో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ- ఎలా ఉందంటే? - Veeranjaneyulu Vihara Yatra